RGV Dance: వైరల్ అవుతోన్న సుల్తానా, రాంగోపాల్ వర్మ మరో డ్యాన్స్ వీడియో.. ఇంతకీ సుల్తానా ఎవరో తెలుసా?
RGV Dance: రాంగోపాల్ వర్మ.. తిండి లేకపోయినా సరే ఉంటాడేమో కానీ, వివాదం లేకుండా మాత్రం ఉండలేరు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటారు వర్మ. తనను ఎవరూ తిట్టకపోతే చివరికి...

RGV Dance: రాంగోపాల్ వర్మ.. తిండి లేకపోయినా సరే ఉంటాడేమో కానీ, వివాదం లేకుండా మాత్రం ఉండలేరు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటారు వర్మ. తనను ఎవరూ తిట్టకపోతే చివరికి తనను తానే తిట్టుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎవరు ఏమన్నా.. తన జీవితం తన ఇష్టం అంటూ, తన చావు తాను చస్తానని కామెంట్ చేస్తుంటారు వర్మ. ఇక సోషల్ మీడియాలో వర్మ చేసే హంగామా మాములుగా ఉండదు. ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇనాయా సుల్తానా అనే ఓ యువతితో వర్మ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వర్మ ఇందులో కాస్త హద్దులు మీరి ప్రవర్తించడంతో నెట్టింట పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ వీడియోపై ఆ యువతి మాత్రం స్పందించలేదు.
I officially share this video of mine and @RGVzoomin pic.twitter.com/gr80fFARnK
— Inaya Sultana (@inaya_sultana) August 25, 2021
ఇక ఈ వీడియో వేడి ఇంకా తగ్గకముందే మరో వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ఈసారి ఆ యువతి మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇనాయా సుల్తానా పుట్టిన రోజున జరిగిన వేడుకల్లో భాగంగా వర్మ ఈ రచ్చ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా సుల్తానా ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. వర్మతో చేసిన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నేను, రాంగోపాల్ వర్మ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను.. అధికారికంగా నేను షేర్ చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఆర్జీవీ ఆ యువతికి ఇష్టం లేకుండా డ్యాన్స్ చేశాడన్న కామెంట్లకు సుల్తానా చెక్ పెట్టినట్లైంది.
ఇంతకీ ఈ సుల్తానా ఎవరో తెలుసా.?
రాంగోపాల్ వర్మతో డ్యాన్స్ చేయగానే ఇనాయా సుల్తానా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీంతో ఆమె గురించి నెటిజన్లు తెగ వెతకడం ప్రారంభించారు. ఇంతకీ ఈ యువతి ఎవరో తెలుసా.? ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రాణిస్తోన్న అప్‌కమింగ్ యాక్ట్రస్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో రానున్న సినిమాలో ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ‘అవ్యోం జగత్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు దినేష్ నర్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘బుజ్జి ఇలా రా’ అనే సినిమాలోనూ ఇనాయా ఓ చిన్న పాత్రలో నటిస్తోంది. మరి వర్మ ద్వారా వచ్చిన ఈ ఫేమ్‌ను ఇనాయా ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇనాయాకు ఇప్పటికే ఈగల్ మీడియా వర్క్స్ నుంచి ఓ ఆఫర్ వచ్చేసింది. తమ సంస్థలో కొత్త యాంకర్ ఇన్ చీఫ్‌గా నియమించుకుంది.
Congratulations @sandeepskb128 and @inaya_sultana
Thank you DON RGV@RGVzoomin https://t.co/tqtEB9xSFP
— Shrikanth Iyyangar (@drksi13) August 24, 2021
Also Read: Rashi Khanna: షూటింగ్ విరామంలో రాశీ ఖన్నా ఏం చేస్తుందో చూశారా.? దాని గురించే ఆలోచన..
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఈ కోణాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు




