Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Movie Controversy: బేబి లీక్స్.. డైరెక్టర్ సాయి రాజేశ్ అలాంటి వ్యక్తి.. నటి గాయత్రి గుప్తా సెన్సెషన్ కామెంట్స్.. ప్రూవ్స్ ఇవే..

బేబీ సినిమా కథ మొత్తం తనదే అని.. తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని శిరిన్ ఆరోపణలు చేశాడు. కొన్ని రోజులుగా బేబి సినిమా వివాదం నడుస్తుంది. తన స్టోరీని కాపీ కొట్టాడంటూ సాక్ష్యాలతో సహా సాయిరాజేష్ మీద బేబి లీక్స్ అనే పేరుతో బుక్ కూడా విడుదల చేశాడు. ఈ బుక్ వివరాలను బేబి లీక్స్ అనే వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చాడు.ఇప్పుడు ఈ బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చాడు.

Baby Movie Controversy: బేబి లీక్స్.. డైరెక్టర్ సాయి రాజేశ్ అలాంటి వ్యక్తి.. నటి గాయత్రి గుప్తా సెన్సెషన్ కామెంట్స్.. ప్రూవ్స్ ఇవే..
Gayatri Gupta
Follow us
Rajitha Chanti

|

Updated on: May 30, 2024 | 1:09 PM

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబి సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. అయితే డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బేబీ సినిమా కథ మొత్తం తనదే అని.. తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని శిరిన్ ఆరోపణలు చేశాడు. కొన్ని రోజులుగా బేబి సినిమా వివాదం నడుస్తుంది. తన స్టోరీని కాపీ కొట్టాడంటూ సాక్ష్యాలతో సహా సాయిరాజేష్ మీద బేబి లీక్స్ అనే పేరుతో బుక్ కూడా విడుదల చేశాడు. ఈ బుక్ వివరాలను బేబి లీక్స్ అనే వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చాడు.ఇప్పుడు ఈ బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని మీడియా ముందుకు తీసుకువచ్చాడు. ఇక ఇదే విషయంపై సినీ నటి గాయత్రి గుప్తా స్పందించింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో పాపులర్ అయ్యింది గాయత్రి. ఇందులో సాయి పల్లవి స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ 2, కొబ్బరి మట్ట, మిఠాయి చిత్రాల్లో నటించింది. బేబి సినిమా కథను ముందుగా శిరిన్ ప్రేమించొద్దు అనే పేరుతో రాసుకున్నారని సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అందులో గాయత్రి మాట్లాడుతూ.. “బేబి సినిమా కథను ముందుగా శిరిన్ ప్రేమించొద్దు పేరుతో రాసుకున్నాడు. కానీ ఆ స్టోరీని సాయి రాజేశ్ కాపీ కొట్టాడు. ప్రేమించొద్దు సినిమాకు ముందుగా నన్ను హీరోయిన్‏గా అనుకున్నాడు. అందుకు లుక్ టెస్ట్ కూడా జరిగింది. ఓ స్కూల్ డ్రెస్ తీసుకువచ్చి ఫోటోషూట్ చేశాడు. ఈ ఫోటోలను నేను సాయి రాజేశ్ కు చూపించాను. మొత్తం బేబి సినిమాలో కాపీ కొట్టాడు. ట్రైలర్ విడుదలయ్యాక చూసి షాకయ్యాను. సాయి రాజేశ్ తో ఇబ్బందులు రావడం నాకు కొత్తేమి కాదు. అతడు డైరెక్ట్ చేసిన కొబ్బరి మట్ట సినిమాలో నేను నటించాను. అప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు” అంటూ చెప్పుకొచ్చింది.

“కొబ్బరి మట్ట సినిమాకు నాకు రూ.3 లక్షలు ఇస్తామన్నారు. కానీ రూ.25 వేల చెక్ మాత్రమే ఇచ్చాడు. కొబ్బరి మట్ట సినిమాలో మధ్యలోనే నేను మాయమవుతాను. గమనించారా.. అంతగా టార్చర్ చేశాడు. ఇక బేబి కథను ముందుగా రాసుకుంది శిరిన్. కానీ సాయి రాజేశ్ మాత్రం తానే క్రియేట్ చేశానని.. తమిళనాడులో ఎక్కడో జరిగిందని చెబుతాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని అనుకున్నారు. కానీ చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్ ను తప్పించారు. అదే కథను కాపి కొట్టేసి సినిమా తీశాడు. గీతా ఆర్ట్స్ సంస్థ చాలా మంచిది. కానీ పాములాంటి సాయి రాజేశ్ ను వారు గుర్తించాలి. బేబి సినిమా కోసం సాయి రాజేశ్ చాలా చీప్ ట్రిక్స్ చేశాడు. బేబి పాత్రను చాలా దారుణంగా చూపించాడు. హీరోయిన్ పై నెగిటివిటీ వచ్చింది. ఆమె పోస్టర్ ను కొందరు చెప్పులతో కొట్టారు. అంతగా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సాయి రాజేశ్ లాంటి వ్యక్తి మచ్చగా మిగిలిపోతాడు. శిరిన్ శ్రీరామ్ కు న్యాయం జరగాలి” అంటూ కామెంట్స్ చేసింది గాయిత్రి గుప్తా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.