Balakrishna: బాలకృష్ణ సీసా వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ.. అంజలిని ఎందుకు తోసేసారంటే..

ఈ సినిమాను మే 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్, విశ్వక్ సేన్ లపై ప్రశంసలు కురిపించారు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు

Balakrishna: బాలకృష్ణ సీసా వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ.. అంజలిని ఎందుకు తోసేసారంటే..
Nagavamshi
Follow us

|

Updated on: May 30, 2024 | 12:44 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్, విశ్వక్ సేన్ లపై ప్రశంసలు కురిపించారు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ప్రవర్తనపై ట్రోల్స్ చేస్తున్నారు. వేదికపై హీరోయిన్ అంజలిని తోసేసిన క్లిప్ షేర్ చేస్తూ బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం పై క్లారిటీ ఇచ్చారు హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ.

బాలకృష్ణకు సంబంధించిన వీడియోలపై విలేకరులు ప్రశ్నించగా.. విశ్వక్ సేన్, నాగవంశీ అసలు విషయం చెప్పేశారు. స్టేజ్ పై హీరోయిన్ అంజలిని బాలకృష్ణ సరదాగానే తోసేసారని.. ఆ తర్వాత వాళ్లిద్దరు హైఫై ఇచ్చుకున్నారని.. కానీ అంతకు ముందు జరిగిన విషయం.. ఆ తర్వాత జరిగిన ఘటనలను కాకుండా కేవలం తోసేసిన వీడియోను చూపిస్తున్నారని అన్నారు. కేవలం దానిని కాంట్రవర్సి చేయాలని ప్లాన్ చేసి కొందరు ఆ వీడియోను అలా షేర్ చేస్తున్నారని.. ఆ వీడియోకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు నాగవంశీ. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫుల్ వీడియో చూస్తే అందరికీ క్లారిటీ వస్తుందని.. ఇలా సగం సగం చూస్తే ఏం అర్థం కాదని అన్నారు విశ్వక్ సేన్.

అలాగే బాలయ్య కూర్చున్న దగ్గర వాటర్ బాటిల్ తోపాటు.. మరో వాటర్ బాటిల్లో ఆల్కహాల్ ఉన్నట్లు కనిపించింది. ఇక అదే వీడియోకు క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. బాలయ్య కూర్చున్న దగ్గర బాటిల్స్ పెట్టారు అంటున్నారని.. అక్కడ అలాంటివేం లేవని.. అవన్నీ సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్)లో పెట్టారని అన్నారు. బాలయ్య కూర్చున్న దగ్గర అసలు ఏం పెట్టలేదని.. ఈవెంటే చేసింది తనేనని.. అక్కడ అలాంటి బాటిల్స్ ఏం పెట్టలేదని.. అవి సీజీలో చేసిన బాటిల్స్ మాత్రమే అని అన్నారు. దయచేసి ట్రోల్స్ ఆపాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా మాట్లాడుకుందామా అంటూ టాపిక్ డైవర్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..