Vijay Antony: బిచ్చగాడు హీరో షాకింగ్ నిర్ణయం.. జీవితాంతం ఆ పని చేయనంటున్న విజయ్ ఆంటోని..
. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా తుఫాన్. ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, ప్రదీప్, పంకజ్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. తాజాగా టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించింది చిత్రయూనిట్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి చెప్పక్కర్లేదు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో అటు తమిళ్.. ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోని నటిస్తున్న ప్రతి సినిమాను ఇటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బిచ్చగాడు 2, లవ్ గురు చిత్రాలు విజయం సాధించాయి. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా తుఫాన్. ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, ప్రదీప్, పంకజ్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. తాజాగా టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలలో హీరో విజయ్ ఆంటోని చెప్పులు లేకుండా కనిపించారు.
ఇక ఇదే విషయాన్ని ప్రశ్నించగా విజయ్ ఆంటోని ఆసక్తికర సమాధానమిచ్చారు. “కొద్ది రోజుల క్రితం చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను. ఇది చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇటీవల కొన్ని నెలల క్రితం విజయ్ ఆంటోని పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఒత్తిడిని భరించలేక చనిపోతున్నట్లు సూసైడ్ లెటర్ రాసింది. కూతురి మరణం తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన విజయ్.. కొద్దిరోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇకపై తాను చేసే అన్ని సామాజిక సేవ కార్యక్రమాలను తన కూతురి పేరుతో చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇదిలా ఉంటే జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కెవీ కూడా తాను చెప్పులు వేసుకోవడానికి ఆసక్తి చూపించనని చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నివేదికలలో వెల్లడైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.