నాఫొటోకు లైక్ కొట్టండి.. గుడ్ న్యూస్ చెప్తా.. స్టార్ హీరోయిన్ క్రేజీ పోస్ట్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలు తగ్గించి ఇతర బిజినెస్ ల్లో బిజీ అయిపోయారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అందం అభినయం ఉండి సినిమాలకు దూరం అయినవారు ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ కు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అవకాశాలు కూడా ఎక్కువగానే వచ్చాయి ఈ చిన్నదానికి.

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ.. మరికొంతమంది మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. కానీ మనం ఇక్కడ చూస్తున్న హీరోయిన్ మాత్రం అలా కాదు. హీరోయిన్ గా సినిమాలు చేయడం లేదు కానీ సినీ ఫీల్డ్ లోనే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. అంతే కాదు నటన పరంగా , గ్లామర్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్ లో ఉండగానే హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పేసింది. హీరోయిన్ గా కెరీర్ కు గుడ్ బై చెప్పినప్పటికీ ఇప్పుడు సినీ రంగంలోనే యాక్టివ్ గా ఉంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన
తన పోస్ట్ కు లైక్ కొడితే గుడ్ న్యూస్ వింటారు అని రాసుకొచ్చింది ఆ ముద్దుగుమ్మ ఇంతకూ ఆమె ఎవరంటే.. చార్మీ కౌర్ . ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతి లక్ష్మిఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ అమ్మడు. తన నటనతో పాటు గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా పీక్స్ లో ఉండగానే ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేసింది. నిర్మాతగా మారి ఇప్పుడు సినిమాలు చేస్తుంది ఈ పంజాబీ భామ.
ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ప్రొడ్యూసర్ గా ఛార్మి పార్ట్నర్ షిప్ మొదలు పెట్టింది. పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి 8 చిత్రాలు నిర్మించింది. వాటిలో జ్యోతి లక్ష్మి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ పోస్ట్ షేర్ చేసింది. ఒక క్యూట్ పిక్ ను షేర్ చేసి ఈ పోస్ట్‌ను లైక్ చేసిన వాళ్లు త్వరలోనే ఒక శుభవార్త వింటారు’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఛార్మి పెళ్లి చేసుకోబోతుందని కూడా కామెంట్స్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








