Silk Smitha: పాన్ ఇండియా మూవీగా సిల్క్ స్మిత జీవితకథ.. హీరోయిన్‌గా ఎవరంటే..

చిన్న వయసులోని కష్టాలను చవి చూశారు సిల్క్. చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి సినిమా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా చేరారు సిల్క్. ఆతర్వాత హీరోయిన్ కావాలని ఆశపడ్డారు. కానీ అది కుదరలేదు. దాంతో ఆమె స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ లో నటించారు. తక్కువ సమయంలో డబ్బు, ఆస్తి, పేరు సొంతం చేసుకుంది సిల్క్.. కానీ ఆమె నమ్మినవారే మోసం చేయడంతో ఒంటరి అయిపొయింది.

Silk Smitha: పాన్ ఇండియా మూవీగా సిల్క్ స్మిత జీవితకథ.. హీరోయిన్‌గా ఎవరంటే..
Silk Smitha
Follow us

|

Updated on: Dec 02, 2023 | 5:06 PM

సిల్క్ స్మిత.. ఈ పేరు తెలియని వారు ఉండరు. నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సిల్క్ స్మిత. అప్పట్లో స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారును ఓ ఊపు ఊపారు ఈ అందాల నటి. చిన్న వయసులోని కష్టాలను చవి చూశారు సిల్క్. చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి సినిమా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా చేరారు సిల్క్. ఆ తర్వాత హీరోయిన్ కావాలని ఆశపడ్డారు. కానీ అది కుదరలేదు. దాంతో ఆమె స్పెషల్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ లో నటించారు. తక్కువ సమయంలో డబ్బు, ఆస్తి, పేరు సొంతం చేసుకుంది సిల్క్.. కానీ ఆమె నమ్మినవారే మోసం చేయడంతో ఒంటరి అయిపొయింది. ఒంటరి తనాన్ని భరించలేక డిప్రషన్ లోకి వెళ్లిన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 36 ఏళ్లకే తనువు చాలించింది సిల్క్ స్మిత.

నేడు సిల్క్ స్మిత జయంతి.. విజయలక్ష్మి వడ్లపాటిగా  సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. సిల్క్ స్మిత గా పేరు మార్చుకొని దూసుకుపోయారు. ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ లో ‘బావలు సయ్యా’ సాంగ్ ఇప్పటికీ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. కష్టాలు కడలిని ఈదిన సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఇప్పుడు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆమె జీవితంలో చాలా మందికి తెలియని కోణాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

ఈ సినిమాలో సిల్క్ పాత్రలో చంద్రిక రవి నటిస్తుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో చంద్రిక రవి స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక ఇప్పుడు సిల్క్ స్మిత సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజే చేశారు. ఈ పోస్టర్ లో చంద్రిక రవి సిల్క్ ను మ్యాచ్ చేసింది. ఆమె పర్ఫెక్ట్ గా సిల్క్ లుక్ లో సెట్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. గతంలో సిల్క్ జీవితం నేపథ్యంలో డర్టీ పిచ్చర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

చంద్రిక రవి ట్విట్టర్ పోస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.