AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom Pre Release Event: మీ ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి.: భాగ్యశ్రీ బోర్సే

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓ చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మళ్ళీరావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు

Kingdom Pre Release Event: మీ ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి.: భాగ్యశ్రీ బోర్సే
Bhagyashri Borse
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2025 | 7:13 AM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. సోమవారం(జూలై 26) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అనిరుధ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

‘ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “జులై 31న విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ కోసం మీతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గౌతమ్ గారు ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. ఇందులో పవర్ ఫుల్ పర్ఫామెన్స్ లు చూడబోతున్నారు. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి గొప్ప సినిమాలో విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. గౌతమ్ గారు ఎంతో ప్రతిభగల దర్శకుడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. కింగ్‌డమ్ సినిమాకి అనిరుధ్ గారు హార్ట్ బీట్. సత్యదేవ్ గారు అద్భుతంగా నటించారు. జులై 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.