10th Class Diaries: టెన్త్ క్లాస్ డైరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అవికా, శ్రీరామ్‏ల సినిమా విడుదల ఎప్పుడంటే..

ఈ సినిమా జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ సినిమా నుంచి విడుదలైన

10th Class Diaries: టెన్త్ క్లాస్ డైరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అవికా, శ్రీరామ్‏ల సినిమా విడుదల ఎప్పుడంటే..
10th Class Diaries
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 06, 2022 | 9:14 PM

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది అవికా గోర్ (Avika Gor).  ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరపై సందడి చేసింది ఈ అమ్మడు. తెలుగులో లక్ష్మీ రావే మా ఇంటికీ, సినిమా చూపిస్త మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తో్న్న లేటేస్ట్ చిత్రం టెన్త్ క్లాస్ డైరీస్ (10th Class Diaries). ఇందులో శ్రీరామ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్లపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. గరుడవేగ ఫేమ్ అంజి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ “డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలుచేసినా… వాళ్ళందరి జీవితాల్లో టెన్త్ క్లాస్ మెమరీ అనేది మైల్ స్టోన్ లాంటిది. ఆ మెమ‌రీస్మిగ‌తా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్పార్ట్‌న‌ర్ లాంటిది. ఆ మెమరీస్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కొంత మంది జీవితాల్లోజరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ను రూపొందించాం. పదోతరగతి చదివిన ప్రతి ఒక్కరినీ ఆ రోజులలోకి తీసుకు వెళుతుంది. దర్శకుడు ‘గరుడవేగ’ అంజి వాణిజ్య హంగులతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు రెస్పాన్స్ బావుంది. సినిమా అన్ని వర్గాలప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టెన్త్ క్లాస్ నేపథ్యంలో సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్అవుతాయి. ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత ఈ సినిమాతో నిర్మాతగా మరో హిట్ అందుకుంటాననే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని నైజాంలో ఏషియన్ సునీల్ కి చెందిన గ్లోబల్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది’’ అని అన్నారు.