- Telugu News Photo Gallery Cinema photos Actress sai pallavi speech in virata parvam trailer launch event in kurnool
Sai Pallavi: విరాటపర్వం కథ రావడం చాలా గర్వంగా ఉంది.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Updated on: Jun 06, 2022 | 8:37 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. నక్సల్ మూమెంట్ నేపధ్యంలో ఓ అద్భుతమైన ప్రేమకథని తెరపై ఆవిష్కారించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

ఇందులో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 'ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల ఇది నా కథ అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఆదివారం కర్నూలులో నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ఈదురు గాలులు, వర్షం అంతరాయం కలిగించినప్పటికీ అభిమానులు, పబ్లిక్ సహకారంతో ఈవెంట్ విజయవంతగా జరిగింది. వర్షం కురిసినప్పటికీ చిత్రయూనిట్ సభ్యులు అభిమానులను ఉద్ధేశించి మాట్లాడారు.

హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ..ట్రైలర్ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. విరాటపర్వం లాంటి కథ రావడం చాలా గర్వంగా వుంది. అన్ని బలమైన పాత్రలతో ఒక ప్రాంతానికి సంబధించిన బలమైన కథ చెప్పాలంటే బలమైన రచయిత కావాలి.

అలాంటి బలమైన రచయిత వేణు ఊడుగుల గారి రూపంలో వచ్చారు. తెలంగాణ, భాష, ఊరు గురించి అద్భుతంగా చూపించారు. ఇలాంటి గొప్ప కథలో నాకు అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.

ఒక శిశువు జన్మకు తల్లితండ్రులు ఎంత ముఖ్యమో.. ఇలాంటి గొప్ప సినిమా రావడానికి దర్శకుడు అంత ముఖ్యం.

శ్రీకాంత్ గారు, సుధాకర్ గారు ఈ చిత్రానికి నిర్మాతలు ఏం చేయగలరో దాని కంటే ఎక్కువ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పెద్ద మనసు వున్న వారు వాళ్ళే అంతా చేయాలని అనుకోరు.

వెనక వుండి సహాయం చేస్తారు. రానా గారిది కూడా లాంటి గొప్ప మనసు. అన్నీ తానే చేయాలని అనుకోకుండా సినిమా సైన్ చేసినప్పటి నుండి ఇప్పటివరకూ మాకు సపోర్ట్ గా నిలబడ్డారు.

వెనక వుండి సహాయం చేస్తారు. రానా గారిది కూడా లాంటి గొప్ప మనసు. అన్నీ తానే చేయాలని అనుకోకుండా సినిమా సైన్ చేసినప్పటి నుండి ఇప్పటివరకూ మాకు సపోర్ట్ గా నిలబడ్డారు.

విరాటపర్వం కథ రావడం చాలా గర్వంగా ఉంది.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు..





























