Aparna Balamurali: లావుగా ఉన్నావంటూ ట్రోలింగ్.. సూర్య హీరోయిన్ రియాక్షన్  అదిరిపోయిందిగా.. 

ఈ సినిమా తర్వాత దీతుమ్ నన్నుమ్, వీట్ల విసెనవం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం మలయాలంలో ఆరు, తమిళంలో నీతమ్ ఒరు వానం చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Aparna Balamurali: లావుగా ఉన్నావంటూ ట్రోలింగ్.. సూర్య హీరోయిన్ రియాక్షన్  అదిరిపోయిందిగా.. 
Aparna
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2022 | 11:37 AM

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించి సురారై పొట్టు సినిమాతో వెండితెరకు పరిచయమైంది అపర్ణ బాలమురళి (Aparna Balamurali). ఈ మూవీ తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదలైంది. మొదటి సినిమాతోనే నటనకు మంచి ప్రశంసలు అందుకుంది అపర్ణ. అంతేకాదు.. సంప్రదాయ చీరకట్టులో అచ్చం తెనుగింటి అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమాలోని ఆమె పాత్రరకు సౌత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీతో ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది అపర్ణ. ఈ సినిమా తర్వాత దీతుమ్ నన్నుమ్, వీట్ల విసెనవం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం మలయాలంలో ఆరు, తమిళంలో నీతమ్ ఒరు వానం చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె నిత్యం ఆరుదానం అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా అపర్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె లావు అయినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆమె పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా తనపై వస్తోన్న ట్రోలింగ్.. బాడీ షేమింగ్ పై స్పందించింది అపర్ణా. శరీర బరువుకు.. ప్రతిభకు సంబంధమే లేదంటూ చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తి బరువు పెరగడానికి శరీరంలోని అనేక సమస్యలు కారణమవుతాయి. నేను బొద్దుగా ఉన్నాను. అదే లుక్‏తో సినిమాల్లో నటించమని అడిగేవాళ్లు చాలా మంది ఉన్నారు. నా శరీర ఆకారం పై వస్తున్న కామెంట్స్ చూసి మొదట్లో చాలా బాధపడ్డాను. లావుగా ఉన్నావు అమ్మ పాత్రలో నటిస్తావా ? అని అడుగుతున్నారు. కానీ నా వయసు అమ్మ పాత్రలు నటించేంత కాదు. కొందరు సన్నగా ఉంటేనే హీరోయిన్లుగా భావిస్తారు. సన్నగా ఉంటేనే హీరోయిన్ గా ఛాన్స్ దొరుకుతుందన్న విషయం ఏంటీ అనేది అర్థం కావడం లేదు. చిత్రపరిశ్రమలో తారతమ్యం లేని సినిమాల్లో హీరోయిన్లకు ఫిజికల్ అప్పియరెన్స్ చూసుకుంటారు.. అంటూ చెప్పుకొచ్చింది అపర్ణా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..