
సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలు ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకొక్క హీరోయిన్ పేరుమీద వందలాది అకౌంట్స్ ఉంటాయి. హీరోయిన్స్ ఫోటోలను ఓ రేంజ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు నెటిజన్స్. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ పై ట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా హీరోయిన్స్ తప్పుచేసినా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్.. అలాగే ఎవరైనా హీరోయిన్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసిన కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక తమ పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు కొంతమంది ముద్దుగుమ్మలు గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉంటారు.
తమ పై ట్రోల్ చేసే వారికి అదిరిపోయే కౌంటర్లు ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా అదే పని చేసింది. తన పై నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్ పై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు అందాల భామ అన్షు అంబానీ.. కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కవ్వించింది అన్షు. ఆతర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో మెరిసింది. ఆ తర్వాత టాలీవుడ్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఇటీవలే మజాకా అనే సినిమాలో నటించింది.
సందీప్ కిషన్ నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అన్షు తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో అమ్మడు గ్లామర్ డోస్ కాస్త పెంచేసింది. అయితే కొంతమంది ఈ ముద్దుగుమ్మ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. తన పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి అన్షు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇద్దరు పిల్లల తల్లివి.. కాస్త పద్దతిగా ఉండొచ్చుగా.. 20ఏళ్ల అమ్మాయివి అనుకుంటున్నావా.? సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి, ఇప్పుడు సన్నగా అయ్యావు. ఇలాంటి కామెంట్స్ చేసే బదులు ఏదైనా పని చేసుకోండి. ఎందుకంటే ఈ కామెంట్స్ చూస్తేనే మీరు ఎలాంటివారో ఆర్డమవుతుంది. ఇక నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు. కనీసం లిప్స్ పీలర్ కూడా చేయించుకోలేదు. కానీ నాకే ఇబ్బందిగా అనిపించి స్లిమ్‌గా అయ్యా.. నేను ఇప్పుడు బాగానే ఉన్నా.. . మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చేయండి.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అన్షు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.