Amala Paul: హీరోయిన్ అమలా పాల్‏కు లైంగిక వేధింపులు.. పోలీసుల అదుపులో మాజీ ప్రియుడు..

| Edited By: Ravi Kiran

Aug 30, 2022 | 8:17 PM

ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి..పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ లావాదేవీలలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పవీంధర్ సింగ్ కి అమలాపాల్ దూరంగా ఉంటున్నారు.

Amala Paul: హీరోయిన్ అమలా పాల్‏కు లైంగిక వేధింపులు.. పోలీసుల అదుపులో మాజీ ప్రియుడు..
Amala Paul
Follow us on

హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) విల్లుపురం పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ మాజీ ప్రియుడు పవీంధర్ సింగ్ బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె మాజీ ప్రియుడి పై 16 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరో 11 మంది కోసం గాలింపు చేపట్టారు. వివరాల ప్రకారం.. 2018లో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఆ తర్వాత జిల్లాలోని ఆరోవిల్ సమీపంలోని పెరియముదలియార్ చావడికి మార్చారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి..పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ లావాదేవీలలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో పవీంధర్ సింగ్ కి అమలాపాల్ దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు తనకి కావాల్సిన డబ్బులు ఇవ్వకపోయిన, తన మాట వినకపోయిన ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని.. అంతేకాకుండా.. ఆమె నిర్మాణ సంస్థ డైరెక్టర్‏గా అమలాపాల్ పేరును తొలగిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేశాడని.. పవీంధర్ సింగ్ మిత్రులు కూడా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి