Aishwarya Rai Bachchan: ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్యరాయ్ బుధవారం(మే 15) రాత్రి ముంబై విమానాశ్రయంలో కనిపించింది. గాయపడిన ఆమె చేతిని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆమెకు ఏమైందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చేతికి గాయం కావడంతో ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై కనిపించడం అనుమానమే అని చాలామంది అనుకున్నారు.
అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమాల్లోనే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. ఈ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా చేస్తుంది. అలాగే చాలా సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్‌పై నడుస్తుంది. ఈసారి కూడా రెడ్ కార్పెట్ పై మెరిసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో కూడా అడుగులు వేసింది. ఆశ్చర్యం ఏంటంటే.. రెడ్ కార్పెట్ పై చేతికి కట్టు కట్టుకుని కనిపించింది. ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఆమె కాన్ఫిడెన్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఐశ్వర్యరాయ్ బుధవారం(మే 15) రాత్రి ముంబై విమానాశ్రయంలో కనిపించింది. గాయపడిన ఆమె చేతిని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆమెకు ఏమైందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చేతికి గాయం కావడంతో ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై కనిపించడం అనుమానమే అని చాలామంది అనుకున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం తన నిబద్ధతను చాటుకుంది.
ఐశ్వర్యరాయ్ తన చేతికి గాయమైనా కూడా కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. నలుపు, తెలుపు, బంగారు రంగుల్లో డిజైన్ చేసిన గౌనులో అబ్బురపరిచింది. కుడి చేతికి కట్టు ఉన్నప్పటికీ, ఆమె దానిని పెద్దగా పట్టించుకోకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ అమ్మడు ఫొటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడం ఇది మొదటి సారి కాదు. 2002లో, ఆమె మొదటిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా అక్కడికి వెళ్లి తన ఉనికిని చాటుతుంది. ఇప్పటివరకు, అతను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద 21 సార్లు నడిచింది ఐశ్వర్య. ఈసారి రెడ్ కార్పెట్ మీద గాయాన్ని లెక్కచేయకుండా చిరునవ్వుతో ఫోజులిచ్చింది ఐశ్వర్య.
Exclusive ~ Aishwarya Rai at Cannes 2024 ! 🔥🥀❤️#AishwaryaRaiBachan #Aishwaryaraiatcannes #cannes2024 pic.twitter.com/v3F6QxNf4V
— Mishkat Mahir (@MahirMishkat) May 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.