ముఖం నిండా గాయాలతో కనిపిస్తోన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? సినిమా కోసం ఇంతటి సాహసం చేయాలా?
రిలీజ్‌కు ముందే ఎంతో వివాదాస్పదమైన ఈ సినిమా వసూళ్లలో ఏ మాత్రం తగ్గడం లేదు. మే 5న విడుదలైన ఈ సినిమా రూ.230 కోట్లమేర వసూలు చేసింది. మరికొద్ది రోజుల్లో రూ.250 కోట్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లవ్ జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాలో షాలిని ఉన్నికృష్ణన్ అలియాస్ ఫాతిమా అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించింది అదా శర్మ.

అదా శర్మ.. గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు బాగా ట్రెండ్ అవుతోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ సినిమానే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రిలీజ్‌కు ముందే ఎంతో వివాదాస్పదమైన ఈ సినిమా వసూళ్లలో ఏ మాత్రం తగ్గడం లేదు. మే 5న విడుదలైన ఈ సినిమా రూ.230 కోట్లమేర వసూలు చేసింది. మరికొద్ది రోజుల్లో రూ.250 కోట్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లవ్ జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాలో షాలిని ఉన్నికృష్ణన్ అలియాస్ ఫాతిమా అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించింది అదా శర్మ. మూవీలో ఈ ముద్దుగుమ్మ అభినయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ది కేరళ స్టోరీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉందీ అందాల తార.. అయితే ఈ విజయం తేలికగా రాలేదంటోందీ ముద్దుగుమ్మ. ఈక్రమంలో ది కేరళ స్టోరీ సినిమా కోసం తానెంతలా కష్టపడిందో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అదా శర్మ. ఇందులో ముఖం నిండా గాయాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హార్ట్ ఎటాక్ హీరోయిన్.




ది కేరళ స్టోరీ సినిమా షూటింగ్‌లో భాగంగా అఫ్ఘనిస్తాన్ షూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అదా శర్మ.. ‘ మైనస్ 16 డిగ్రీల వాతావరణంలో సుమారు 40 గంటల పాటు ఉన్నాం. డీహైడ్రేషన్ కారణంగా నా పెదాలు పగిలిపోయాయి. ఫొటోలో కనిపిస్తున్న పరుపు నేను కింద పడే సమయానికి వేద్దామనుకున్నారు. అయితే అది జరగలేదు. దీంతో నా ముఖానికి దెబ్బలు తగిలాయి. ఏదైతేనేం.. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది, అందుకు సంతోషంగా ఉంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సినిమా కోసం ఆమె డెడికేషన్ అద్భుతమంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
