Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్లుగా అతన్ని ప్రేమిస్తున్నాను.. అతన్నే పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం చెప్పిన అభినయ

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన “నేనింతే” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అమ్మాయి. అభినయ పుట్టికతోనే మూగ, చెవుడు. అయినప్పటికీ నటి కావాలన్న తన కోరికను ధృడ సంకల్పంతో నెరవేర్చుకుంది. తండ్రి కూడా నటుడే అవడం ఆమెకు కొంతమేర కలిసివచ్చింది. తమిళంలో ప్రముఖ డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించిన “నాడోడిగళ్” చిత్రం ద్వారా అభినయ కెమెరా ముందుకు వచ్చింది.

15 ఏళ్లుగా అతన్ని ప్రేమిస్తున్నాను.. అతన్నే పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం చెప్పిన అభినయ
Abinaya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 30, 2025 | 9:31 AM

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే వారు మన దగ్గర కోకొల్లలు. అలాగే తమ అభినయంతో ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్న వారు ఉన్నారు. వారందరిలో ఈ నటి చాలా ప్రత్యేకం.. తన కళ్ళతోనే ఎమోషన్స్ పలికించగలదు. ఆమె నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.. ఆమె మరెవరో కాదు అభినయ. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెవులు వినపడకపోయిన, మాట రాకపోయిన తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది అభినయ. 2009 లో “నాదోదిగల్” అనే చిత్రంతో రంగప్రవేశం చేసింది అభినయ.  తెలుగు, కన్నడ చిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషించింది అభినయ.

హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించింది. మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన “శంభో శివ శంభో” సినిమాలో హీరో చెల్లెలిగా నటించి మెప్పించింది. అలాగే దమ్ము చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్ కు సోదరి పాత్రను పోషించింది. వెంకటేష్, మహేష్ బాబు నటించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో వారికి సోదరిగా నటించింది. ఇలా ఎన్నో సినిమాల్లో అభినయ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే ఆమె స్టార్ హీరో విశాల్ తో ప్రేమలో ఉందంటూ మొన్నామధ్య వార్తలు వినిపించాయి. దాని పై అభినయ క్లారిటీ కూడా ఇచ్చింది.

విశాల్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన తన అభిమాన నటుడు అని తెలిపింది. యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అభినయ పని అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నానని, త్వరలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించింది అభినయ. అతను ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. త్వరలోనే దీని పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.