Vishwaksen: ఇకపై అలా చేయను.. లైలా సినిమా రిజల్ట్ పై ఫ్యాన్స్‏కు విశ్వక్ సేన్ లెటర్..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా లెటర్ రాశారు. ఇటీవల తాను నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని.. ఇక నుంచి ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ షేర్ చేసిన లెటర్ నెట్టింట వైరలవుతుంది.

Vishwaksen: ఇకపై అలా చేయను.. లైలా సినిమా రిజల్ట్ పై ఫ్యాన్స్‏కు విశ్వక్ సేన్ లెటర్..
Vishwaksen

Updated on: Feb 20, 2025 | 9:58 PM

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల లైలా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో మంచి క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన సినిమాకు ఊహించని రిజల్ట్ వచ్చింది. అంతకు ముందు వచ్చిన మెకానిక్ రాకీ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన అభిమానులకు స్పెషల్ లెటర్ రాశారు. ఇకపై తాను నటించే సినిమాలు ప్రేక్షకులు మెచ్చేలా ఉండేలా చూసుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

“నమస్తే.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి.. నా అభిమానులకు, నా పై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనం తీసుకురావడమే. కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు.

ఇవి కూడా చదవండి

నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు.. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే.. నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి.. నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ” అంటూ రాసుకొచ్చారు విశ్వక్ సేన్.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన