AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్‌ చూస్తున్నారా?

ఓటీటీ ప్లాట్ ఫామ్స్, సోషల్ మీడియా కంటెంట్‌పై ఫోకస్‌ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. లైన్ క్రాస్‌ చేశారా దబిడిదిబిడే అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓ సారి లుక్కేయండి. అదేంటంటే..

OTT: ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్‌ చూస్తున్నారా?
Ott
Ravi Kiran
|

Updated on: Feb 20, 2025 | 9:17 PM

Share

ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం నేపథ్యంలో కేంద్రం అలర్ట్‌ అయింది. ఓటీటీలు, సోషల్ మీడియాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను ఓటీటీలు, సోషల్ మీడియాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చిన్నారులకు ఎ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌లపై ఫిర్యాదులు అందాయని… ఓటీటీ సంస్థలు అన్ని కూడా తప్పకుండా నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. ఇక నుంచి వయస్సు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇటీవల రణ్‌వీర్ చేసిన కామెంట్స్‌పై పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కూడా రణ్‌వీర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక కట్టుబాట్లను గాలికొదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా.? అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా..? అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది. దీనిపై చర్చ నడుస్తున్న క్రమంలో ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్‌పై కేంద్రం ప్రకటన జారీ చేసింది. అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ను అసలు ప్రసారం చేయకూడదని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్టాక్‌ మార్కెట్‌ నుంచి సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌!
స్టాక్‌ మార్కెట్‌ నుంచి సంపాదించాలనుకుంటే ఇదే బెస్ట్‌ ఛాన్స్‌!
దినఫలాలు (10 మే 2026): ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.
దినఫలాలు (10 మే 2026): ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.
హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్..
హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
ఆ రోగాలకు దివ్యాస్త్రం.. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఇక తిరుగుండదు..
ఆ రోగాలకు దివ్యాస్త్రం.. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఇక తిరుగుండదు..
నార్త్ టు ఈస్ట్.. మిషన్ కంప్లీటెడ్! హైదరాబాద్‌లో మోదీ టూర్..
నార్త్ టు ఈస్ట్.. మిషన్ కంప్లీటెడ్! హైదరాబాద్‌లో మోదీ టూర్..
రెడ్‌బుక్‌లో జగన్ తర్వాత.. ఉన్నది ఆ పేరే- మాజీ మంత్రి రోజా
రెడ్‌బుక్‌లో జగన్ తర్వాత.. ఉన్నది ఆ పేరే- మాజీ మంత్రి రోజా
ఒకే ఓవర్‌లో 11 బంతులు.. ఫిక్సింగ్ ఆరోపణలతో నెట్టింట దుమారం
ఒకే ఓవర్‌లో 11 బంతులు.. ఫిక్సింగ్ ఆరోపణలతో నెట్టింట దుమారం
పవన్‌ను నేను ఎప్పుడూ తిట్టలేదు.. జస్ట్‌ నిజాలు చెప్పా- రోజా
పవన్‌ను నేను ఎప్పుడూ తిట్టలేదు.. జస్ట్‌ నిజాలు చెప్పా- రోజా
పవన్ కళ్యాణ్‌ ఇంటికి ప్రధాని మోదీ..!
పవన్ కళ్యాణ్‌ ఇంటికి ప్రధాని మోదీ..!