Tollywood: నటుడు విజయ రంగరాజు ఆకస్మిక మరణం
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారునిగా రాణించి.. సినీ రంగానికి వచ్చారు రంగరాజు. ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా చాలా సినిమాల్లో మెప్పించారు.

నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం చెందారు. చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో ఆయన గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డ విజయ రంగరాజు. దీంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ హార్ట్ అటాక్‌తో మరణించారు. రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో అలరించారు రంగరాజు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా ఫస్ట్ మూవీ. అయితే నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది మాత్రం బాలయ్య హీరోగా వచ్చిన ‘భైరవ ద్వీపం’ చిత్రం. ఈ సినిమాలో నటనకుగాను మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత విజయ రంగరాజు కెరీర్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే ‘యజ్ఞం’ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన ఆయన, ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో రంగరాజుకు ప్రావీణ్యం ఉంది.
2020 సంవత్సరంలో.. కన్నడ దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ గురించి అనుచిత కామెంట్స్ చేసి.. నెట్టింట ట్రోల్ అయ్యారు విజయ రంగరాజు . విష్ణువర్ధన్ అభిమానులే కాదు.. కన్నడ స్టార్ హీరోలు సైతం విజయ రంగరాజుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కిచ్చా సుదీప్, దర్శన్, దివంగత పునీత్ రాజ్‌కుమార్, యశ్ వంటి వారు విజయ రంగరాజు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రంగరాజు తాను తప్పు చేశానని బోరున ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు.
ఇది కూడా చదవండి: ‘ఉచితాలు వద్దు.. ఉపాధి ముద్దు’.. ఓ ఆటో డ్రైవర్ కొటేషన్ వైరల్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




