- Telugu News Entertainment Tollywood Actor uttej wife padma condolence meet.. chiranjeevi, srikanth, nagababu, krishna reddy, rajashekar
actor Uttej: ప్రముఖ నటుడు ఉత్తేజ్ శ్రీమతి పద్మ సంస్మరణ సభ.. సంతాపాన్ని వ్యక్తం చేసిన సినీప్రముఖులు..
నటుడు, రచయిత, స్నేహశీలి, చిత్ర పరిశ్రమలోని ప్రతీ ఒక్కరోతోనూ సత్ సంబంధాలు కలిగినటువంటి మంచి మనిషి ఉత్తేజ్
Updated on: Sep 30, 2021 | 9:40 PM

నటుడు, రచయిత, స్నేహశీలి, చిత్ర పరిశ్రమలోని ప్రతీ ఒక్కరోతోనూ సత్ సంబంధాలు కలిగినటువంటి మంచి మనిషి ఉత్తేజ్

సతీమణి శ్రీమతి పద్మ అనారోగ్య కారణంగా అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ విషయం ఇండస్ట్రీలో అందర్నీ కలచివేసింది..

మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం కాన్సర్ హాస్పటల్ కు వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అంతే కాకుండా మేమంతా నీకు అండగా ఉంటాం.. అని మనో ధైర్యాన్ని కలిగించారు.

30న హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్ సిసి క్లబ్ లో ఉత్తేజ్ సతీమణి శ్రీమతి పద్మ సంస్మరణ సభ జరిగింది..

మెగాస్టార్ ,మాట్లాడుతూ.. హిట్లర్ సినిమా నుండి ఉత్తేజ్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఆపద సమయంలో ఉత్తేజ్ కు మేము అందరం అండదండగా ఉంటాం. ఈ విషాదం నుండి ఉత్తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను

ఈ సంతాప సభలో హీరోలు డా. రాజశేఖర్ ,శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి , గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.

సినీప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఉత్తేజ్ కు ఆత్మస్థైర్యాన్ని పద్మకు ఆత్మ శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు.





























