AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Darshan: నేరస్థుడికి శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.. దర్శన్ కేసుపై హీరో సుదీప్ సంచలన కామెంట్స్..

శనివారం ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు దర్శన్, పవిత్రగౌడతోపాటు మిగతా నిందితులను మరో ఐదు రోజులు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దర్శన్ కేసుపై ఇప్పటికే పలువురు కన్నడ సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా హీరో సుదీప్ సైతం దర్శన్ కేసుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో నేరస్థుడికి శిక్ష పడితే ఇండస్ట్రీలో సంతోషిస్తుందని అన్నారు. అలాగే న్యాయం గెలవాలని.. రేణుకస్వామి భార్యకు న్యాయం జరగాలని అన్నారు.

Actor Darshan: నేరస్థుడికి శిక్ష పడితే ఇండస్ట్రీ సంతోషిస్తుంది.. దర్శన్ కేసుపై హీరో సుదీప్ సంచలన కామెంట్స్..
Darshan
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2024 | 8:01 AM

Share

రేణుకాస్వామి హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కన్నడ హీరో దర్శన్.. నటి పవిత్రగౌడతోపాటు మరో పదమూడు మందిని అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. శనివారం ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు దర్శన్, పవిత్రగౌడతోపాటు మిగతా నిందితులను మరో ఐదు రోజులు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దర్శన్ కేసుపై ఇప్పటికే పలువురు కన్నడ సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా హీరో సుదీప్ సైతం దర్శన్ కేసుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో నేరస్థుడికి శిక్ష పడితే ఇండస్ట్రీలో సంతోషిస్తుందని అన్నారు. అలాగే న్యాయం గెలవాలని.. రేణుకస్వామి భార్యకు న్యాయం జరగాలని అన్నారు.

‘ఇదంతా నాకు తెలుసు… మీరు (మీడియా) ఏం చూపిస్తున్నారో మాకు తెలుసు. నిజానిజాలను బయటకు తీసుకురావడానికి మీడియా, పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో రెండో మాట లేదు నాకు తెలిసి ఈ కేసు విషయంలో సీఎం స్వయంగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల మీ వార్తల్లో చూశాను. కర్నాటకలో పెద్ద పదవిలో ఉన్న ఆయన మీడియా, పోలీసులు సక్రమంగా పనిచేస్తుంటే సామాన్యుడిగా ఆ ఆర్టిస్టు పేరు రాదని నా అభిప్రాయం. నేను వారికి మద్దతుగా మాట్లాడటం చాలా తప్పు. అలాగే వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే అవుతుంది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. రోడ్డుపై అనాథ శవంలా పడిపోయిన రేణుకస్వామి కుటుంబానికి న్యాయం జరగాలి. పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయాలి. అన్నింటికీ మించి న్యాయంపై అందరికీ నమ్మకం ఉండాలి అంటే ఈ కేసులో మంచి న్యాయం జరగాలి’ అని కిచ్చా సుదీప్ అన్నారు.

‘మనం ఏ ప్రదేశంలోనూ లేము. ప్రతి ఒక్కరి హృదయం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. వాతావరణం సరిగ్గా కనిపించడం లేదు. సినీ పరిశ్రమకు న్యాయం జరగాలి. అన్ని కారణాలను చిత్ర పరిశ్రమపై నిందలు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి క్లీన్ చిట్ కావాలి. చాలా మంది కళాకారులు ఉన్నారు. సినిమా అనేది ఒకటి-రెండు కాదు. దోషికి శిక్ష పడితే సినీ పరిశ్రమ సంతోషిస్తుంది’కిచ్చా సుదీప్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us