వయసు 51.. అయినా తగ్గని పసిడి ఛాయ..! ‘డింపుల్ బ్యూటీ’ ఫిట్‌నెస్ సీక్రెట్
వెండితెరపై తన చిరునవ్వుతో కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన ఆ హీరోయిన్కు ఇప్పుడు 51 ఏళ్లు. వయసు పెరుగుతున్నా ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు సరే కదా, కుర్ర హీరోయిన్లకు పోటీనిచ్చేలా ఫిట్‌నెస్‌తో మెరిసిపోతోంది. నిరంతరం జిమ్‌లో చెమట చిందిస్తూ తన శరీర సౌష్టవాన్ని కాపాడుకుంటున్న ఆ క్రేజీ హీరోయిన్ ఎవరు? ఆమెను అంత యాక్టివ్‌గా ఉంచుతున్న ఆ రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ప్రీతి జింటా 51 ఏళ్లు వచ్చినా తరగని అందం, పసిడి స్కిన్ టోన్‌తో అలరిస్తున్నారు. ఈ ప్రెట్టీ ఉమెన్ తన అంకితభావంతో అభిమానులకు కొత్త ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్దేశిస్తోంది. తన ఫిట్‌నెస్ ప్రయాణానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోంది.
కఠిన శిక్షణ
ప్రీతి జింటా తన ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా మార్గదర్శకత్వంలో ఆమె ప్రతిరోజూ జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తోంది. సౌకర్యవంతమైన అథ్లీజర్ దుస్తులు ధరించి, జుట్టును పోనీటైల్‌గా కట్టుకుని ఆమె చేసే వర్కవుట్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎంత కష్టమైన వ్యాయామం అయినా సరే, ఏకాగ్రతతో పూర్తి చేయడం ఆమె ప్రత్యేకత. ఆమె పట్టుదల, నిలకడైన శ్రమ నేటి తరం యువతకు పెద్ద స్ఫూర్తిగా నిలుస్తోంది.
View this post on Instagram
ప్రీతి ఫిట్‌నెస్ రొటీన్‌లో కేవలం ఒకే రకమైన వ్యాయామాలు ఉండవు. కండరాల బలాన్ని పెంచే స్ట్రెంత్ ట్రైనింగ్‌తో పాటు, శరీర సమతుల్యతను మెరుగుపరిచే ఫంక్షనల్ ఎక్సర్‌సైజ్‌లను ఆమె కలిపి చేస్తుంది.
- స్క్వాట్స్, లంజెస్, క్రంచెస్, స్ట్రెచెస్, పుల్ డౌన్స్ వంటి వ్యాయామాలను ఆమె క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తుంది.
- ఈ వైవిధ్యమైన వర్కవుట్స్ వల్ల శరీర కండరాలు దృఢంగా మారడమే కాకుండా, శరీర భంగిమ, సమన్వయం అద్భుతంగా మెరుగుపడతాయి. కేవలం శారీరక శ్రమ మాత్రమే కాకుండా, సానుకూల దృక్పథం కలిగి ఉండటం కూడా తన ఆరోగ్యానికి ప్రధాన కారణమని ఆమె విశ్వసిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమే కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకుంటే ఏ వయసులోనైనా ఉత్సాహంగా ఉండవచ్చని బాలీవుడ్ భామ ప్రీతి జింటా నిరూపిస్తోంది.
