
ఇటీవల కురిసిన వర్షల కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లడంతో చాలా ఊర్లు నీట మునిగిపోయాయి.చాలా ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అలాగే ఎంతో మంది వరదల్లో చిక్కుకున్నారు కూడా.. ప్రజలకు ఎంతో ఆస్తినష్టం నెలకొంది. ఇక వరదల్లో చిక్కుకున్నవారికి, ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వాలు, అధికారులు ఆదుకుంటున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా వరద బాధితులకు సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వరదబాధితులను ఆదుకున్నారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు.. కలియుగ కర్ణుడు సోనూసూద్ ముందుకు వచ్చాడు.
నటుడు సోనూ సూద్ ఇప్పటికే ఎంతో మందికి సాయం చేశాడు. కష్టం అన్న ప్రతివారికి సోనూసూద్ సహాయం చేశాడు. తాజాగా సోనూ సూద్ పంజాబ్లో వచ్చిన వరద ప్రాంతాల్లో పర్యటించాడు. ఇటీవల కురిసిన వర్షల కారణంగా పంజాబ్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలాగే అమృత్ సర్ లోని వరద ప్రాంతాల్లో పర్యటించిన సోనూసూద్.. అక్కడి బాధితులను పరామర్శించాడు. అక్కడి వారికి సాయం చేస్తానని హామీ ఇచ్చాడు.
వరదల కారణంగా చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి, ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు.. ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి ఇళ్లు నిర్మిస్తాను అని సోనూసూద్ హామీ ఇచ్చారు. వరదల్లో ఇళ్లు కోల్పోయినవారికి సోనూ సూద్ కొత్త ఇళ్లను నిర్మిస్తాను అని హామీ ఇవ్వడం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సోనూసూద్ మంచి మనసును కొనియాడుతున్నారు. ప్రజలు, నెటిజన్స్ సోనూసూద్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. సోనూసూద్ లాంటి వారు ఊరుకి ఒకరు ఉండాలి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.