Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharwanand: మొదలైన శర్వానంద్ పెళ్లి సందడి.. హాల్దీ ఫంక్షన్ వీడియో వైరల్..

ఇప్పటికే రెండు కుటుంబాలు ప్యాలెస్‏కు చేరుకుని పెళ్లి పనులు మొదలు పెట్టారు. తాజాగా హాల్దీ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో శర్వానంద్ అక్కడున్నవారికి పసుపు రాసుకుంటూ సందడి చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మెహందీ కార్యక్రమం, రేపు ఉదయం 11 గంటలకు పెళ్లి కొడుకు వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

Sharwanand: మొదలైన శర్వానంద్ పెళ్లి సందడి.. హాల్దీ ఫంక్షన్ వీడియో వైరల్..
Sharwanand
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 02, 2023 | 4:21 PM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 26న రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‏తో శర్వా నిశ్చితార్థం జరగ్గా.. శనివారం రాత్రి వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. జైపూర్‏లోని లీలా ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు ప్యాలెస్‏కు చేరుకుని పెళ్లి పనులు మొదలు పెట్టారు. తాజాగా హాల్దీ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో శర్వానంద్ అక్కడున్నవారికి పసుపు రాసుకుంటూ సందడి చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మెహందీ కార్యక్రమం, రేపు ఉదయం 11 గంటలకు పెళ్లి కొడుకు వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

అలాగే రేపు రాత్రి 11 గంటలకు వీరిద్దరి వివాహం జరుగబోతుంది. అయితే వీరి పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, రానా, మిగతా సినీ ప్రముఖులు హజరుకానున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్ధం జరిగిన ఆరు నెలలు తరువాత ఇప్పుడు వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శర్వా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. పెళ్లి కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు శర్వా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.