AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : ఇండస్ట్రీలో తోపు హీరో.. కట్ చేస్తే.. జైలులో పనిచేస్తూ డబ్బులు సంపాదించాడు.. ఇప్పుడు ఇలా..

సినీరంగుల ప్రపంచంలో నటీనటుల జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేము. వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న తారల జీవితాల్లో ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. అనేక కష్టాలు, సవాళ్లను దాటుకుని ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో గురించి మీకు తెలుసా.. ?

Actor : ఇండస్ట్రీలో తోపు హీరో.. కట్ చేస్తే.. జైలులో పనిచేస్తూ డబ్బులు సంపాదించాడు.. ఇప్పుడు ఇలా..
Sanjay Dutt
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2025 | 12:43 PM

Share

భారతీయ సినిమా ప్రపంచంలో అతడు స్టార్ హీరో. బాలనటుడిగా తెరంగేట్రం చేసిన అతడు.. ఆ తర్వాత హీరోగానూ మారారు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే సంజయ్ దత్. యన చాలా సినిమాల్లో నటించారు. దక్షిణాదిలో కూడా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నటుడు తన వృత్తి జీవితం కంటే తన వ్యక్తిగత జీవితం వల్లే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చాలా విషయాలు వెల్లడించారు. అదే సమయంలో తాను జైలులో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సంజయ్ దత్ తన స్నేహితుడు నటుడు సునీల్ శెట్టితో కలిసి హాస్యనటుడు కపిల్ శర్మ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: ఇది సక్సెస్ అంటే.. రూ.4 కోట్లు పెడితే.. రూ.121 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను శాసించిన సినిమా..

తన కొన్ని రోజుల జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సంజయ్ దత్ జైలులో పనిచేసేవాడనని, దానికి తనకు జీతం కూడా ఇచ్చేవారని చెప్పారు. సంజయ్ దత్ జైలులో తన సొంత రేడియో షోను నిర్వహించేవాడు. దీనితో పాటు, నటుడు ఒక థియేటర్ కంపెనీని కూడా స్థాపించాడు. దీనితో పాటు, సంజయ్ జైలులో కుర్చీలు, పేపర్ బ్యాగులు తయారు చేయడం ద్వారా కూడా డబ్బు సంపాదించాడు. “నేను జైలులో కూడా నాటకాలు వేశాను. హత్యలు చేసిన వ్యక్తులు నాతో కలిసి పనిచేశారు. నేను ఖైదీల నుండి నాటకాలకు కథలు రాసేవాడిని” అని ఆయన అన్నారు. సంజయ్ దత్ రూ.38,000 సంపాదించాడు. అందులో నుంచి జైలులో నిత్యావసరాలు కొన్నాడు. చివరికి ఆయన దగ్గర రూ.450 మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకరు తోపు డైరెక్టర్.. ఇంకొకరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ ఇద్దరి టాలెంట్‏కు ప్రపంచమే జై కొట్టింది..

1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయుధ చట్టానికి సంబంధించిన కేసుల్లో ఈ నటుడు అనేకసార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఐదు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం విలన్ పాత్రలతో ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు సహయ నటుడిగా కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

Sanjay Dutt Looks

Sanjay Dutt Looks

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. క్రేజీ ఫోటోలతో గత్తరలేపుతున్న యాంకరమ్మ.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టరా.. ?