Sai Durgha Tej: డియర్ సందీప్.. ధైర్యంగా ఉండండి.. ‘మోగ్లీ’ సినిమా దర్శకుడికి అండగా మెగా హీరో

బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమాల రిలీజ్ పై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మోగ్లీ దర్శకుడు సందీప్ రాజ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Sai Durgha Tej: డియర్ సందీప్.. ధైర్యంగా ఉండండి.. మోగ్లీ సినిమా దర్శకుడికి అండగా మెగా హీరో
Sai Durgha Tej, Sandeep Raj

Updated on: Dec 09, 2025 | 6:56 PM

బాలకృష్ణ ‘అఖండ 2’ అనుకున్న టైమ్ రిలీజ్ అయి ఉంటే ఈ వారం దాదాపు 15 కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేవి. అయితే అఖండ 2 మూవీ అనూహ్యంగా వాయిదా పడడం, రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ వారం సినిమాల రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ‘అఖండ 2’ డిసెంబరు 12న బాక్సాఫీసు ముందుకు వస్తే.. ఆ రోజు విడుదలయ్యేందుకు సిద్ధమైన పలు సినిమాలు వాయిదా పడే అవకాశాలున్నాయి. అందులో సుమ కుమారుడు రోషన్ హీరోగా నటించిన మోగ్లీ కూడా ఉంది. కలర్ ఫొటోతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా రోజులుగా కష్టపడి తెరకెక్కించిన మోగ్లీ సినిమా వాయిదా పడే అవకాశాలుండడంతో ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘సినిమాపై ఎంతో ప్యాషన్‌ ఉన్న వ్యక్తులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. కలర్ ఫొటో, మోగ్లీ ఈ ఈ రెండు సినిమాలకు సంబంధించి రెండు కామన్‌ పాయింట్స్‌ ఏంటంటే.. 1. అంతా సవ్యంగానే జరుగుతోందని అనుకుంటే.. విడుదల విషయంలో దురదృష్టం ఎదురవడం. 2. నేను. నాదే ‘బ్యాడ్‌లక్‌’ అనుకుంటున్నా.. ‘డైరెక్టెడ్‌ బై సందీప్‌రాజ్‌’ అని సిల్వర్ స్క్రీన్ పై నా పేరు చూసుకోవాలన్న కల రోజు రోజుకూ కష్టతరమవుతోంది. . రోషన్‌, సరోజ్‌, సాక్షి, హర్ష, డీవోపీ మారుతి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాల భైరవ.. ఇలా అంకిత భావం ఉన్న ఎంతోమంది కష్టంతో ‘మోగ్లీ’ రూపొందింది. వారి కోసమైనా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చారు సందీప్ రాజ్.

కాగా సందీప్ ట్వీట్‌పై మెగా హీరో సాయి దుర్గాతేజ్‌స్పందించారు. ‘డియర్ సందీప్‌.. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా దక్కుతుంది. ధైర్యంగా ఉండండి. మీ విషయంలో మీరు గర్వపడండి. చివరకు సినిమా గెలుస్తుంది’ అని సందీప్ కు భరోసా ఇచ్చాడు సాయి దుర్గాతేజ్‌. ఇక బేబీ నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ.. ‘డియర్‌ సందీప్‌.. జాతీయ అవార్డు చిత్రం ‘కలర్‌ ఫోటో’లో మీరు ఒక భాగం. ఈ అడ్డంకులన్నీ తాత్కాలికం. దిగులు పడొద్దు. మీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు, మద్దతు ఇస్తారు. ఆల్‌ ది బెస్ట్‌’ అని విషెస్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మెగా హీరో ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.