Rama Rao On Duty: రామారావు వచ్చేస్తున్నాడు.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడంటే ?..

ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రాలలో రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) ఒకటి.. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను

Rama Rao On Duty: రామారావు వచ్చేస్తున్నాడు.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడంటే ?..
Ramrao On Duty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 22, 2022 | 5:24 PM

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు.. చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత విడుదలైన ఖిలాడి మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో తన తదుపరి ప్రాజెక్స్ విషయంలో రవితేజ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా టాక్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రాలలో రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) ఒకటి.. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ఈ చిత్రాన్ని జూన్ 17న విడుదల చేయాల్సి ఉండగా.. అనుహ్యంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చింది చిత్రయూనిట్.. ఇప్పటికే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

బుధవారం రమారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.. ఈ చిత్రాన్ని జూలై 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రవితేజాకు జోడిగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేష్‌, పవిత్రా లోకేష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతోపాటు రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.