AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Mohan: విడాకులు కావాల్సిందే.. తెగేసి చెప్పిన స్టార్ హీరో.. భరణం కోరిన భార్య.. ఎంతంటే?

కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), అతని సతీమణి ఆర్తిల విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. తాజాగా వీరిద్దరూ ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన భార్య ఆర్తితో ఇక కలిసుండలేనని రవి మోహన్ తెగేసి చెప్పాడు.

Ravi Mohan: విడాకులు కావాల్సిందే.. తెగేసి చెప్పిన స్టార్ హీరో.. భరణం కోరిన భార్య.. ఎంతంటే?
Ravi Mohan Family
Basha Shek
|

Updated on: May 21, 2025 | 4:02 PM

Share

తమ విడాకుల కేసుకు సంబంధించి కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్, అతని భార్య ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం రాజీ కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఇద్దరికీ సూచించింది. అయితే ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని నటుడు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఆమెతో వెంటనే విడాకులు మంజూరు చేయాలని రవి మోహన్ లీగల్ టీమ్ న్యాయస్థానాన్ని కోరింది. ఇదే క్రమంలో విడాకులు కోరుతోన్న తన భర్త నుంచి భరణం కావాలని ఆర్తి కోరింది. నెలకు రూ. 40 లక్షలు ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో న్యాయ స్థానం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

కాగా ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ తనయుడే రవి మోహన్. మెగా స్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను తీసిన దర్శకుడు మోహన్‌ రాజా ఆయన సోదరుడు. ఇక కోలీవుడ్ లో రవి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక అతను 2009లో ప్రముఖ నిర్మాత త సుజాత విజయకుమార్‌ కూతురు ఆర్తిని 2009లో వివాహం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరవ్‌, అయాన్‌ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యతో 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన రవి మోహన్ గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చాడు. రవి మోహన్ ప్రముఖ సింగర్ కెనీషాతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నాడని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకకు రవి, కెనీషాల కలిసి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు. వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. దీనిపై ఆర్తి కూడా ఘాటుగానే స్పందించింది. ఇక ఈ వ్యవహారంపై జయం రవి, కెనీషా ఒకవైపు, ఆర్తి మరోవైపు ఉండి ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

జూన్ 12కు వాయిదా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.