Ram Pothineni: ది వారియర్ డైరెక్టర్ పై రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ చిత్రాలకు స్పూర్తి అంటూ..

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ

Ram Pothineni: ది వారియర్ డైరెక్టర్ పై రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ చిత్రాలకు స్పూర్తి అంటూ..
Ram
Follow us

|

Updated on: Jul 02, 2022 | 11:40 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది వారియర్. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలోని సాంగ్స్ ఓవైపు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ క్రమంలో శుక్రవారం అనంతపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో పాల్గోన్న రామ్ పోతినేని డైరెక్టర్ లింగుస్వామి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ”అనంతపురం… ఇక్కడ ఎక్కువ సినిమా ఫంక్షన్స్ జరగవని, అక్కడ పెడదామని చెప్పారు. ‘ఆరు గంటల ప్రయాణం. ఫర్వాలేదా?’ అంటే… ‘పర్వాలేదు’ అని చెప్పాను. ఆరు గంటల సంగతి చెప్పారు కానీ… స్టేడియం స్టార్టింగ్ నుంచి స్టేజి మీదకు రావడానికి గంట పడుతుందని ఎవరూ చెప్పలేదు. ‘మీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది’ అని అడుగుతుంటారు. ‘ఇదిగో, ఇక్కడి నుంచి (అభిమానులను చూపిస్తూ) వస్తుంది. ఇక్కడికి వచ్చిన, మా ట్రైలర్ విడుదల చేసిన బోయపాటి గారికి థాంక్స్. ఆయన చేతుల మీదుగా జరిగింది కాబట్టి సగం హిట్ అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా మందిని మీట్ అవుతాం. మంచి మనసున్న మనిషి లింగుస్వామి. సినిమాలో ప్రతి ఎమోషన్ ఆయన జెన్యూన్‌గా ఫీలై చేసింది. తెలుగులో చాలా కమర్షియల్ హిట్స్ అయిన సినిమాల్లో సీన్లు లింగుస్వామి సినిమాల్లో సీన్లు చూసి స్ఫూర్తి పొందినవి. నాకు ఆయా దర్శకులు వచ్చి చెప్పారు. మా సినిమా తమిళ్ ట్రైలర్ విడుదల చేసిన శివ కార్తికేయన్ గారికి థాంక్స్. ‘ది వారియర్’ జూలై 14న విడుదలవుతోంది. థియేటర్లలో కలుద్దాం” అని అన్నారు.

Latest Articles
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!