Acharya: ఆచార్య సినిమాలో రామ్ చరణ్‏కు ఇష్టమైన సీన్ ఏంటో తెలుసా ?.. థియేటర్లలో విజిల్స్ పడాల్సిందే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఆచార్య మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.. డైరెక్టర్ కొరటాల శివ.. చిరంజీవి

Acharya: ఆచార్య సినిమాలో రామ్ చరణ్‏కు ఇష్టమైన సీన్ ఏంటో తెలుసా ?.. థియేటర్లలో విజిల్స్ పడాల్సిందే..
Ram Charan
Follow us

|

Updated on: Apr 27, 2022 | 12:30 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఆచార్య మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.. డైరెక్టర్ కొరటాల శివ.. చిరంజీవి కాంబోలో వచ్చిన ఈ మూవీలో చరణ్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందని ముందునుంచి చెప్తున్నారు మేకర్స్. ఇందులో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటించాడు. ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్ ఆచార్య సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ప్రీరిలీజ్ ఈవెంట్.. మీడియా సమావేశాలు అంటూ ఫుల్ బిజీగా షెడ్యూల్ గడిపేస్తున్నారు ఆచార్య చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఆచార్య ముూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నారు. తాజాగా తనకు ఆచార్య సినిమాలో అత్యంత ఇష్టమైన సీన్ ఏంటో బయటపెట్టారు రామ్ చరణ్..

చిరంజీవితో కలిసి నక్సలైట్‏గా ఉన్నప్పుడు అడవిలో చిరుతపులి కనిపించే సీన్ తనకు అన్నింటికంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు. ఆ సీన్ గురించి తనకు పూర్తిగా తెలియకుండానే చిత్ర యూనిట్ షూటింగ్ చేసిందని.. తాను అదొక మాంటేజ్ షాట్ అయ్యి ఉంటుందని భావించానని చెప్పుకొచ్చాడు. కానీ డైరెక్టర్ కొరటాల శివ అసలు ఆ సీన్ తనకు చూపించి సర్ ప్రైజ్ చేశారని.. అందుకే ఆ సీన్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. చిరుతపులులు తమను చూస్తూన్న సీన్ చూస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని.. థియేటర్లలో ఆ సీన్ చూసినప్పుడు ఖచ్చితంగా విజిల్స్ పడతాయన్నారు చరణ్. ఇందులో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

Sonu Sood: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్..

Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..

Viral Photo: చంద్రబింబంలాంటి ఈ చిన్నది.. హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాతగానూ రాణిస్తోంది.. ఎవరో గుర్తుపట్టండి..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్