AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr.Rajasekhar : ఫుల్లుగా మందు తాగేసి శివాలయానికి వెళ్ళాను..కానీ.. షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ హీరో రాజశేఖర్

రాజశేఖర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో విలన్ గా నటించి మెప్పించారు. ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. రాజశేఖర్ ముఖ్యంగా పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. ప్రతిఘటన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్. రాజశేఖర్ తొలి సినిమా వందేమాతరం. అలాగే అంకుశం సినిమాలో ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది.

Dr.Rajasekhar : ఫుల్లుగా మందు తాగేసి శివాలయానికి వెళ్ళాను..కానీ.. షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ హీరో రాజశేఖర్
Hero Rajasekhar
Rajeev Rayala
|

Updated on: Dec 26, 2023 | 6:55 PM

Share

సీనియర్ హీరో రాజశేఖర్ తన సినిమాలతో ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే టైటిల్ తో రాణించారు రాజశేఖర్. తండ్రి కోరిక మేరకు డాక్టర్ అయిన రాజశేఖర్ ఆతర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రాజశేఖర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో విలన్ గా నటించి మెప్పించారు. ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. రాజశేఖర్ ముఖ్యంగా పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. ప్రతిఘటన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్. రాజశేఖర్ తొలి సినిమా వందేమాతరం. అలాగే అంకుశం సినిమాలో ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. ఆయన పాత్రకు సాయి కుమార్ గాత్రదానం చేశాడు.

రాజశేఖర్ కు నత్తి సమస్య ఉంది. దాంతో ఆయన పై కొందరు విమర్శలు కూడా చేశారని తెలిపారు. తనకు ఉన్న ఆసక్తితో  నటుడిగా నిలబడ్డారు రాజశేఖర్. చాలా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఒక దశలో సినిమాలు సరిగా ఆడక స్వంత ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. గరుడవేగ సినిమా తర్వాత మళ్ళీ నిలదొక్కుకోగలిగారు రాజశేఖర్. ఇటీవలే నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించారు.  ఇదిలా ఉంటే అప్పట్లో రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మొదట్లో తనకు దేవుడంటే నమ్మకం లేదు అని తెలిపారు. అప్పట్లో తనకంటే ఐదేళ్లు పెద్ద అమ్మాయిని ప్రేమించానని.. అయితే ఆ అమ్మాయి రిజక్ట్ చేసిందని తెలిపారు రాజశేఖర్. అమ్మాయి రిజక్ట్ చేయడంతో దేవదాస్ అయ్యానని ముందుకు సిగిరెట్ కు అలవాటు పడ్డానని చెప్పారు. అప్పుడు ఒక ఫ్రెండ్ దేవుడి మీద నమ్మకం లేదు అందుకే ఇలా జరిగిందని చెప్పాడు. అదే సమయంలో పక్కన ఉన్న ఓ శివాలయానికి వెళ్ళాను.. ఆసమయంలో నేను తాగేసి ఉన్నాను.. దేవుడిని మీ పై నమ్మకం లేదు.. నేను తాగి ఉన్నాను.. క్షమించమని అడిగాను.. అలాగే తాను ఓ అమ్మాయిని ప్రేమించానని కానీ రిజక్ట్ చేసిందని చెప్పుకున్నా.. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే నమ్ముతాను.. లేదంటే మీరు రాయి అనే నమ్ముతాను అని చెప్పను అని అన్నారు. ఆ తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పింది అని అన్నారు రాజశేఖర్. రా రా పోరా.. అన్న అమ్మాయి రండి పొండి.. అని అంది అని చెప్పుకొచ్చారు రాజశేఖర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.