R Narayana Murthy: ‘వారికి శిరస్సు వంచి దండం పెడుతున్నా’.. ఆస్పత్రి నుంచి ఆర్ నారాయణ మూర్తి డిశ్చార్జ్‌

|

Jul 21, 2024 | 7:24 AM

ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. దీంతో పీపుల్స్ స్టార్ అభిమానులు సంతోషిస్తున్నారు. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు నారాయణ మూర్తి

R Narayana Murthy: వారికి శిరస్సు వంచి దండం పెడుతున్నా.. ఆస్పత్రి నుంచి ఆర్ నారాయణ మూర్తి డిశ్చార్జ్‌
Actor R Narayana Murthy
Follow us on

ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారు. దీంతో పీపుల్స్ స్టార్ అభిమానులు సంతోషిస్తున్నారు. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు నారాయణ మూర్తి. ‘భగవంతుడి దయ వల్ల నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు దగ్గరుండి చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తో పాటు అక్కడి డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇక నా క్షేమాన్ని కోరుకున్న అభిమానులు, ప్రజా దేవుళ్లకు నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయంపై మాట్లాడిన నిమ్స్ వైద్యులు.. నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఏ సమస్యా లేదని, అయితే రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలన్నారు. అంతకు ముందు ఆర్ నారాయణ మూర్తికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌ చేసి పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే నారాయణ మూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వైద్యులను అడిగి కేటీఆర్‌ తెలుసుకున్నారు.

కాగా అనారోగ్య సమస్యలతో బుధవారం (జులై 17) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు నారాయణ మూర్తి. ఉన్నట్లుండి ఆయన ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా పీపుల్ స్టార్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే స్వయంగా ఆర్ నారాయణ మూర్తే తన ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. నిమ్స్ వైద్యులు కూడా ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అప్పుడే ప్రకటించారు. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని నిమ్స్ లోనే డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచారు. అలా నాలుగు రోజుల పాటు హాస్పిటల్ కే పరిమితమైన నారాయణ మూర్తి ఇప్పుడు బయటకొచ్చారు. దీంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రి బెడ్ పై నారాయణ మూర్తి..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి..

ఫోన్ లో కేటీఆర్ పరామర్శ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.