AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh: రూ. 10 కోట్లు కోసమే రమ్య నాకు విడాకులు ఇవ్వడం లేదు.. నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్..

మ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్‌. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు నరేష్. కర్నాటక రౌడీ రాకేష్‌శెట్టితో రెక్కీ చేయించిందని,

Naresh: రూ. 10 కోట్లు కోసమే రమ్య నాకు విడాకులు ఇవ్వడం లేదు.. నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్..
Naresh
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2023 | 9:39 PM

Share

గత కొద్ది రోజులుగా నటుడు నరేష్ వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. న్యూఇయర్ సందర్భంగా సహనటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వీడియో షేర్ చేస్తూ ప్రకటించారు నరేష్. దీంతో ఆయన మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగారు. నరేష్ పై అనేక ఆరోపణలు చేశారు. ఇక నరేష్‌-రమ్య రఘుపతి ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయ్‌. రమ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్‌. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు నరేష్. కర్నాటక రౌడీ రాకేష్‌శెట్టితో రెక్కీ చేయించిందని, కృష్ణ మరణించిన సమయంలో ఈ రెక్కీ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఓ పోలీస్‌ ఆఫీసర్‌ సాయంతో తన ఫోన్‌ హ్యాక్‌ చేసిందంటున్నారు. తాజాగా నరేష్ లైవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

రమ్య ప్రవర్తనపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు నరేష్‌. పెళ్లైన తర్వాతి నెల నుంచే తనను వేధించడం మొదలుపెట్టిందంటూ సీక్రెట్స్‌ బయటపెట్టారు. తిండి పెట్టేది కాదు, కొడుకును కొట్టేది, ఫంక్షన్ ఏదైనాసరే తాగి రచ్చరచ్చ చేసేది అంటున్నారు నరేశ్. రమ్యకి తన కంటే డబ్బుపైనే ఎక్కువ ప్రేమ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

” ప్రస్తుతం మా విడాకుల మ్యాటర్ కోర్ట్ లో ఉందని.. రమ్య ఇప్పటికైన నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు .. లేదంటే నీ బాగోతం అంతా ఒక గంట విడియో పెట్టీ అప్లోడ్ చేస్తాను. రఘవీరారెడ్డి కుటుంబ సభ్యులను నువ్వు ఎలా మాట్లాడవో బయట పెడుతా..నా ఆస్తిలో చిల్లీ గవ్వ కూడా నీకు ఇవ్వను.. మా అమ్మకి కూడా రమ్య వ్యవహార శైలి నచ్చేది కాదు. రూ.10 కోట్లు కోసమే నాకు విడాకులు ఇవ్వడం లేదు. రాకేష్ శెట్టి తో కలిసి ప్లాన్ లు వేస్తుంది” అన్నారు నరేష్.