AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: కొత్త కారు కొన్న కింగ్ నాగార్జున.. ధర ఎంతో తెలుసా..?

ఖైరతాబాద్‌ ఆర్టీఓ కార్యాలయంలో సందడి చేశారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. త‌న కొత్త కారు రిజిస్టేష‌న్ కోసం గురువారం ఖైరతాబాద్‌ ఆర్టీఓ కార్యాలయానికి వ‌చ్చారు. సినీ సెలబ్రెటీ RTO ఆఫీస్ రావడంతో అక్కడ తమ పనుల కోసం వచ్చిన నగరవాసులు ఒక్కసారిగా హీరోతో ఫోటో దిగేందుకు, చూసేందుకు గుమిగూడారు. దీంతో అక్కడ చాలా సందడిగా కనిపించిన నాగార్జున అభిమానులతో నవ్వుతూ మాట్లాడారు.

Nagarjuna: కొత్త కారు కొన్న కింగ్ నాగార్జున.. ధర ఎంతో తెలుసా..?
Nagarjuna
Yellender Reddy Ramasagram
| Edited By: Rajitha Chanti|

Updated on: Nov 28, 2024 | 7:01 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోని ధనవంతులైన నటుల్లో ఒకరు. నాగ్ లైఫ్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకమే. తన లైఫ్‌ను కింగ్ సైజ్‌లో అనుభవిస్తుంటారు. ఆయన గ్యారేజ్ నిండా ఇప్పటికే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఈ లిస్టులో టయోటా లెక్సస్ వెహికిల్ వచ్చి చేరింది. ఈ కారు ధర ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోవడం ఖాయం. మార్కెట్ లో కొత్త గా వచ్చిన వాహనాలు ఇష్టంగా కొనుక్కుంటారు. నాగార్జునకు ఆటోమొబైల్స్ పై ఆసక్తి ఎక్కువే. ఎప్పటికప్పుడు తన గ్యరేజ్ లో న్యూమోడల్ వెహికిల్స్ లను చేరుస్తుంటారు. ఇప్పటికే పర్యావరణ హితం కోసం గతేడాది ev వాహనాన్ని కొన్న మన్మధుడు.. తాజాగా టయోటా లెక్సస్ వెహికిల్ కొనుగోలు చేశారు.

అత్యాధునిక ఫీచర్లతో, విలాసవంతమైన ఇంటీరియర్‌తో నాగార్జున కొత్త కారు అదిరిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ కు కారు తో వచ్చారు కింగ్. ఆర్టీఏ ఆఫీస్ లో హీరో సందడి చేయడంతో అభిమానులు హీరోను చూసేందుకు ఎగబడ్డారు. కారు రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేయడానికి ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన నాగార్జునను అధికారులు దగ్గరుండి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతంగా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. తన కొత్త టయోటా లెక్సస్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగిన హీరో నాగార్జునతో అక్కడికి వచ్చిన అభిమానులు ఫోటోలు దిగారు. ఇదిలా ఉంటే హీరో నాగార్జున కొన్న కొత్త కారు ధర దాదాపుగా రెండు కోట్ల పైనే ఉంటుందట.

నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్ సైతం ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే రజినీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..