RGV: ఆర్జీవీ కేసులో తెరపైకి హైబ్రిడ్‌ మోడ్.. కొత్త పాయింట్‌తో వచ్చారుగా

కనిపిస్తున్నాడు.. వినిపిస్తున్నాడు... కానీ ఖాకీలకు మాత్రం చిక్కట్లేదు కాంట్రవర్సియల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్. వీడియోలు రిలీజ్‌ చేస్తూ తనదైన స్టైల్‌లో లాజికల్‌ కొశ్చన్స్‌ వేస్తున్నారు. ఇక తమస్టైల్‌ చూపించేందుకు ఇటు పోలీసులూ గట్టిగానే వెతుకుతున్నారు. ఇటు ఆర్జీవీ లాయర్‌ హైబ్రిడ్‌ ఫార్ములా చెబుతున్నారు.

RGV: ఆర్జీవీ కేసులో తెరపైకి హైబ్రిడ్‌ మోడ్.. కొత్త పాయింట్‌తో వచ్చారుగా
Ram Gopal Varma
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2024 | 6:25 PM

ఆర్జీవీ కేసులో తెరపైకి హైబ్రిడ్‌ మోడ్ తెరపైకి వచ్చింది.  హైబ్రిడ్‌ మోడ్‌లో ఆర్జీవీ విచారణకు వస్తారని ఆయన అడ్వొకేట్ చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో విచారించడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  పోలీసులు ఆర్జీవీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తప్పు చేశారో లేదో కోర్టులో తేలుతుందంటున్నారు ఆర్జీవీ లాయర్. ఇటు ఆర్జీవీ రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

ఇక టీవీ9 తో మాట్లాడిన ఆర్జీవీ లాయర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. హైబ్రీడ్‌ మోడ్‌ గురించి పోలీసులకు తెలియకపోతే లీగల్‌ ఒపీనియన్‌కు వెళ్లాలంటున్నారు. అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని… విషయాన్ని ఇంత హైలైట్‌ చేయాల్సిన అవసరం లేదంటున్నారు.

అంతకుముందు వీడియో రిలీజ్‌ చేసిన వర్మ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే లాజిక్స్‌ మాట్లాడారు. ఎవరో ఎక్కడో కేసులు పెడితే…ఆ సెక్షన్లు తనకెలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదన్నారు. మర్డర్‌ కేసులే ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదు… ఏడాది కిందట పెట్టిన పోస్ట్‌కు ఇప్పుడు నోటీసులెందుకని వర్మ ప్రశ్నించారు.

పోలీసుల సెర్చింగ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ విషయానికొస్తే… కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసులు ఓ వ్యూహంతో ఆయన కోసం వేట సాగిస్తున్నా… వ్యూహం సిన్మా తీసిన వర్మ మాత్రం పోలీసులకు కనబడుటలేదు. దాదాపుగా నాలుగు రోజుల నుంచి వేట కొనసాగుతూనే ఉంది. మూడు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు.. రంగంలోకి స్పెషల్‌ టీములు దిగినప్పటీకీ ఫలితం లేదు. రామ్‌గోపాల్‌ వర్మ జాడ దొరకట్లేదు. ఇటు ఆర్జీవీ ఆచూకీ కోసం ఫిల్మ్‌నగర్‌లోనూ సమాచార సేకరణ జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.