Cyclone Alert: బాబోయ్.. దూసుకువస్తున్న తుఫాన్.. ఏపీలో అతి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉదయానికి తుఫాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Alert: బాబోయ్.. దూసుకువస్తున్న తుఫాన్.. ఏపీలో అతి భారీ వర్షాలు
Cyclone
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 28, 2024 | 6:53 PM

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ వేగంతో  ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందన్నారు. ఇది శుక్రవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.

శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ ఈదురుగాలుల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని వివరించారు.

దీని ప్రభావంతో 29, 30 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం దక్షిణకోస్తా,రాయలసీమలో కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

శనివారం(30వ తేది) వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.  లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు.

రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

తుఫాన్ లైవ్ ట్రాకింగ్ దిగువన తెలుసుకోండి…. 

నవంబర్ 29, శుక్రవారం :

• నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో అతిభారీ నుండి అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల,  అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 30,శనివారం :

• బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ మరియు తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల మరియు అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

strong>డిసెంబర్ 1, ఆదివారం :

• విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు వైఎస్ఆర్ జిల్లాల్లోని జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

డిసెంబర్ 2, సోమవారం :

• అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల,  అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
EVMల చుట్టూ మహారాష్ట్ర రాజకీయం.. శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
గత పదేళ్లతో పోలిస్తే మా పాలన భేష్‌: పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..
మన రవితేజ పై తమిళ్ ఇండస్ట్రీ కన్ను.! పిలుపు దురంలో మాస్ మహారాజ్..