Vijay Sethupathi: విజయ్ సేతుపతితో ఆ యంగ్ హీరో సినిమా.. డైరెక్టర్‌గా లవర్ బాయ్..
విజయ్ సేతుపతికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అభిమానులు ఆయనను మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటారు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలోనూ అదరగొట్టేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు దుబాయ్ లో అకౌంటెంట్.. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలోనూ అదరగొట్టేసాడు. ఇటీవల మహారాజా సినిమాతో మరో బారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ యంగ్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ హీరో మరెవరో కాదు.. ట్రూ లవర్ మూవీతో తెలుగులోనూ పాపులర్ అయిన కోలీవుడ్ యంగ్ హీరో మణికందన్.
మణికందన్ నటించిన ‘కుడుంబస్థాన్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. రాజేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటి సాన్వి మేఘనతో పాటు మణికందన్, గురు సోమసుందరం, ఆర్ సుందర్రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితాన్ని కామెడీగా చూపించారని సినిమా చూసిన అభిమానులు అంటున్నారు. సినీ పరిశ్రమలో రేడియో జాకీగా ఎంట్రీ ఇచ్చిన మణికందన్, చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే స్క్రీన్‌ప్లే, కథలు, డైలాగ్‌లు రాయడంపై కూడా దృష్టి పెట్టాడు. విజయ్ సేతుపతి నటించిన ప్రధాన్ ఉమ్ పరి ప్రఘమ్ , 8 బుల్లెట్లతో తమిళ అభిమానుల దృష్టిని కొంతవరకు ఆకర్షించిన నటుడు మణికందన్. ఆ తర్వాత విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన విక్రమ్ వేద సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. ఈ సినిమాలో నటించడమే కాకుండా సినిమాకు డైలాగ్స్ రాసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు మణికందన్.
ఆ తర్వాత బా.రంజిత్ దర్శకత్వం వహించిన కాలాలో రజనీ కొడుకుగా నటించి కోలీవుడ్ సినీ అభిమానుల గుండెల్లో మణికందన్ స్థానం సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత చిల్లుక్కరుపట్టి, ఏలే వంటి సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యాడు. మణికందన్ నటించిన ‘లవర్’ చిత్రం గతేడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమా విడుదలై యూత్‌లో మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
ఇదిలా ఉంటే.. మణికందన్ ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మణికందన్ తన సినిమా కథను హీరో విజయ్ సేతుపతికి వివరించినట్లు టాక్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..
