Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: ట్రోలింగ్స్ పై మరోసారి యంగ్ హీరో అసహనం.. నెపోటిజం సోషల్ మీడియాలోనే ఉందంటూ సీరియస్..

ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kiran Abbavaram: ట్రోలింగ్స్ పై మరోసారి యంగ్ హీరో అసహనం.. నెపోటిజం సోషల్ మీడియాలోనే ఉందంటూ సీరియస్..
Kiran Abbavaram
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2023 | 7:11 AM

తొలి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కిరణ్ నటించిన పలు చిత్రాలు ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన నటించిన లేటేస్ట్ చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురు తెరకెక్కించిన ఈ సినిమాలో కశ్మీర పరదేశి కథానాయికగా నటించగా.. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కిరణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. కానీ కొన్ని బ్యాచులు తయారవుతున్నాయి. ట్విట్టర్ లో నాపై కావాలని విషం చిమ్ముతున్నారు. ఇంతకుముందు చేసిన ఒకటీ రెండు సినిమాలు బాలేవు. నన్ను విమర్శించారు. ఈసారి అలాంటి కామెంట్స్ రావద్దని చాలా జాగ్రత్తగా మంచి సీన్స్ పెట్టాం. అయినా కూడా సినిమా బాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసిన వాళ్లు ఆ మెసేజ్ లను నాకు చూపిస్తున్నారు. అసలు ఎవరంటున్నారు ? . ఎందుకు బాలేదంటున్నారు అని వివరాలు ఆరా తీసే వాళ్లసలు ఇక్కడివాళ్లే కాదు. ఎవరో కొందరు ఎవడికో రూ. 50 వేలు ఇస్తే బాలేదని వరుస కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాగైతే మాలాంటి యంగ్ హీరోలు ఎలా ఎదుగుతారు ? మీరు నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా నేను వెళ్లను. ఇదే ఇండస్ట్రీలో ఉంటాను. రూ. 70 వేల ఉద్యోగం వదిలేసి ఇక్కడిదాకా వచ్చా. నన్ను కిందకు లాగినా నాకేం పోదు. ట్విట్టర్ ఉంది కదా అని పొద్దున లేచినప్పటినుంచి పక్కవాళ్ల మీద పడి ఏడవడం మానేయండి. నెపోటిజం ఇండస్ట్రీలో ఉంది అనుకుంటారు.. కానీ సోషల్ మీడియాలోనే ఉంది ” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.