AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya: మెగాస్టార్ సినిమాలో విలన్ రోల్.. ఆ ఆలోచన వస్తేనే టెన్షన్ అంటున్న యంగ్ హీరో..

ఆర్ఎక్స్ 100 (RX 100) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ గుమ్మకొండ (Karthikeya).. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా..

Karthikeya: మెగాస్టార్ సినిమాలో విలన్ రోల్.. ఆ ఆలోచన వస్తేనే టెన్షన్ అంటున్న యంగ్ హీరో..
Karthikeya
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2022 | 7:46 PM

Share

ఆర్ఎక్స్ 100 (RX 100) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ గుమ్మకొండ (Karthikeya).. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. నటన పరంగానూ సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‏గా మారిపోయాడు కార్తికేయ. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు ఈ హీలో తలుపు తట్టాయి. అయితే గత కొద్ది రోజులుగా కార్తికేయ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల చావు కబురు చల్లగా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా హిట్ కాలేకపోయింది. అయితే ఈసారి కార్తికేయ మాస్ విలనిజంతో ఆడియన్స్‏ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తమిళ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న వలిమై సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈనెల 24న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా కార్తికేయ మీడియాతో ముచ్చటించాడు.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ రోల్ వస్తే చేస్తారా ? అనే ప్రశ్నకు కార్తికేయ స్పందిస్తూ.. మెగాస్టార్ సినిమాలో విలన్ గా చేయగల్గుతానా లేదా అనేది నా డౌటు. విలన్ పాత్ర అంటే ఆయనకు ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆయనను చూడగానే నేను కిందా, మీదా అవుతాను. ఇక పర్ఫార్మెన్స్ అవకాశం ఎక్కడ ఉంటుంది. ఒక విలన్ గా ఆయన మీదకు వెళ్లడమనే ఆలోచన చేస్తేనే టెన్షన్ అవుతుంది. విలన్ గా కాకపోయిన ఆయన సినిమాలో చిన్న రోల్ చేయాలని ఉంది. నా అభిమాన హీరోతో ఒక సినిమా చేశాను అనే సంతోషం.. మంచిరోల్ చేశాననే సంతృప్తి నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. అలాంటి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు కార్తీకేయ.

Also Read: Keerthy Suresh: ఫాలోవర్లకు ఛాలెంజ్ చేసిన కళావతి.. అదుర్స్ అనిపిస్తున్న కీర్తి సురేష్ వీడియో..

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..