Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..

పాపులర్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ (Indian Idol). దేశ వ్యాప్తంగా ఈ షోకు ఎంతటి ప్రేక్షకాధరణ ఉందో తెలిసిందే. హిందీలో ఎంతో విజయవంతగా దూసుకుపోతున్న

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..
Telugu Indian Idol
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 21, 2022 | 5:44 PM

పాపులర్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ (Indian Idol). దేశ వ్యాప్తంగా ఈ షోకు ఎంతటి ప్రేక్షకాధరణ ఉందో తెలిసిందే. హిందీలో ఎంతో విజయవంతగా దూసుకుపోతున్న ఈషో ఇప్పటివరకు 12 సీజన్లు పూర్తిచేసుకుంది. కేవలం నార్త్ సింగర్స్ మాత్రమే కాకుండా.. సౌత్ సింగర్స్ కూడా ఈషోలో తమ సత్తా చాటారు. తెలుగు నుంచి సింగర్ శ్రీరామ చంద్ర, రేవంత్ హిందీ ఇండియన్ ఐడల్ టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతటి ఫేమస్ సింగింగ్ షో ఇప్పటివరకు తెలుగులో రాలేదు. తాజాగా ఈ షో తెలుగు వెర్షన్‏ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha) తీసుకురాబోతుంది. తెలుగు సింగింగ్ టాలెంట్‏ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోను తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోకు ప్రముఖ సింగర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. అలాగే.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్ కార్తిక్, హీరోయిన్ నిత్యామీనన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. తాజాగా ఆహా ఇండియన్ ఐడల్ షో రైజర్ కార్యక్రమం హైదరాబాద్‏లోని అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్.. తెలుగు ఇండియన్ ఐడల్ షో గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు..

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… ఇండియన్ ఐడల్ షో మన దేశానికి రాకముందు 50 దేశాల్లో వెళ్లి ఇక్కడకు వచ్చింది. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. అలాంటి షో ఇప్పుడు మన హైదరాబాద్‏కి వచ్చింది. హిందీలో వచ్చినప్పుడు సీజన్ 5కు అనుకుంటా ఆ టైంలో మా ఆవిడ శ్రీ రామ చంద్రకు ఓటు వెయ్యండి అని చెప్పింది.. ఆడియన్స్ ఆ షో ను అపూర్వంగా ఆదరించారు. తెలుగు ఇండియన్ ఐడల్ షో అంటే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేసే షో. యూకే.. యూఎస్, ఆస్ట్రేలియా నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా సింగర్స్ ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది తెలుగులో ప్రపంచ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో అని చెప్పవచ్చు. ఈ షోకి జడ్జిగా తమన్, నిత్య మీనన్, కార్తిక్‏లు వ్యవహరిస్తారు. నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ షో ని అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు.

అలాగే సింగర్ శ్రీ రామ చంద్ర మాట్లాడుతూ.. బిగ్గెస్ట్ మ్యూజికల్ షో ను అహా వారు మొదటగా సౌత్ ఇండియాలో తెలుగులో తీసుకువస్తున్నారు. 2010లో సింగర్‏గా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అవకాశాలు రాని ఎంతోమందికి ఈ ప్లాట్ ఫామ్ ఒక వేదిక కాబోతుంది. ఇలాంటి షో నీ తెలుగులో పరిచయం చేస్తున్న అరవింద్ గారికి అహా వారికి థాంక్స్ అని చెప్పారు.

Also Read: Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో అశ్విని తండ్రి మృతి..

Bandla Ganesh: భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు.. బండ్ల గణేశ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌.

Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్‌ అవుతోన్న పాత వీడియో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!