Bandla Ganesh: భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు.. బండ్ల గణేశ్ సెన్సేషనల్ కామెంట్స్.
Bandla Ganesh: బండ్ల గణేష్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మెదలు పెట్టి, నటుడిగానే కాకుండా బడా నిర్మాతగా మారారు బండ్ల గణేష్. అత్యంత తక్కువ సమయంలో సక్సెస్‌ఫుల్ నిర్మాత, బిజినెస్‌మ్యాన్‌గా గుర్తింపు సంపాదించుకున్న బండ్ల..
Bandla Ganesh: బండ్ల గణేష్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మెదలు పెట్టి, నటుడిగానే కాకుండా బడా నిర్మాతగా మారారు బండ్ల గణేష్. అత్యంత తక్కువ సమయంలో సక్సెస్‌ఫుల్ నిర్మాత, బిజినెస్‌మ్యాన్‌గా గుర్తింపు సంపాదించుకున్న బండ్ల.. పలువురు స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనను తాను పవన్‌కు భక్తుడిగా చెప్పుకునే బండ్ల.. మైక్ దొరికితే చాలు పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటిచెబుతుంటారు. గతంలో పలు ఈవెంట్స్‌లో పవన్ కళ్యాణ్‌పై ఆయన కురిపించిన ప్రశంసలు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇలా పలు సార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన బండ్ల గణేష్ తాజాగా మరోసారి ట్రెండింగ్‌లో నిలిచారు. బండ్ల గణేష్ మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. బండ్ల గణేష్‌తో అభిమాని మాట్లాడిన ఫోన్ కాల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఆడియో క్లిప్‌లో బండ్ల అభిమాని మాట్లాడుతూ.. ‘అన్న భీమ్లానాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు వెళ్తున్నావా.? స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నావా.? ఈసారి చింపేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే దీనికి బండ్ల స్పందిస్తూ.. ‘త్రివిక్రమ్ నన్ను రావొద్దు అన్నాడంటా. అదే ఆలోచిస్తున్నాను. నాకు వెళ్లాలని ఉంది, కానీ పిలవలేరు. త్రివిక్రమ్ ప్లాన్ చేసుకొని నన్ను రాకుండా చేస్తున్నాడు. ఆడిటోరియం మొత్తం బండ్లన్న అని అరవండి, నేను స్టేజ్ మీదికి వస్తాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాను చుట్టేస్తోంది. మరి ఇంతకీ ఈ ఆడియోలో మాట్లాడింది నిజంగా బండ్ల గణేషేనా.? లేదా ఎవరైనా మిమిక్రీ లాంటిది ఏదైనా చేశారా.? అన్నది స్పష్టతలేదు. ఈ వైరల్ ఆడియోపై బండ్ల గణేష్ స్పందిస్తే తప్ప.. నిజమేంటో తెలియదు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించాలని చిత్రయూనిట్ భావించింది. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతం రెడ్డి అకాల మరణంతో చిత్ర యూనిట్ వేడుకను మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: Stick Insect: ఓ వ్యక్తి పెంపుడు మిడత.. సగం ఆడ.. సగం మగ.. ఇదెలా సాధ్యం అంటున్న శాస్త్రవేత్తలు