Allu Arha: ‘కచ్చా బాదం..’పాటకు అల్లు అర్హ స్టెప్పలు.. అదరగొట్టిందిగా..! నెట్టింట హల చల్ చేస్తున్న వీడియో..
ఇటీవల సోషల్‌మీడియాలో ‘కచ్చా బాదం.. ’ అంటూ ఓ పాట తెగ వైరలవుతోంది. ఈ పాటకు సామాన్యులనుంచి.. సెలబ్రిటీల వరకూ స్టెప్పులేస్తూ ఆ వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఆ పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసింది.
ఇటీవల సోషల్‌మీడియాలో ‘కచ్చా బాదం.. ’ అంటూ ఓ పాట తెగ వైరలవుతోంది. ఈ పాటకు సామాన్యులనుంచి.. సెలబ్రిటీల వరకూ స్టెప్పులేస్తూ ఆ వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఆ పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేసింది. ఆ వీడియోని బన్నీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. విదేశాలకు చెందిన నెటిజన్లు కూడా ఆ ట్యూన్‌కి ఫిదా అయ్యారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ పాట పాడింది ఏ పాపులర్ సింగరో అనుకుంటే పొరబాటే.. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకునే ఓ వీధి వ్యాపారి పాడిన పాట. కుటుంబ పోషణ కోసం వీధి వీధీ తిరిగి పల్లీలు అమ్ముకునే ఓ వ్యక్తి తన వ్యాపార క్రమంలో పాడిన పాట. ఇప్పుడు ఆ పాట నెట్టింట్లో వైరల్ అవడమే కాదు.. అతడి జీవితాన్నీ మార్చేసింది. పశ్చిమబెంగాల్‌లోని కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ ద్విచక్రవాహనంపై వీధి వీధి తిరుగుతూ పచ్చిపల్లీలు అమ్ముతుంటాడు. పచ్చి పల్లీలను.. కచ్చా బాదం అని కూడా పిలుస్తారు. అలా పల్లీలు అమ్ముకోడానికి అతను పాడే పాట విని జనాలు ఫిదా అయ్యారు. భువన్ ఎక్కడికి వెళ్లినా అతడి చుట్టూ జనం చేరి పాటను వింటూ ఎంజాయ్ చేసేవారు. కొన్ని నెలల కిందట భువన్ పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరలయింది. ఎప్పుడైతే మోడల్ అంజలి అరోరా ఆ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు సృష్టించి వీడియో చేసిందో.. అప్పటి నుంచి ఆ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. నెటిజన్లు ఆ పాటకు అంజలి అరోరా స్టెప్పులు వేస్తూ రీల్స్ చేయడం ప్రారంభించారు. క్రమంగా ఆ క్రేజ్ దేశంతోపాటు విదేశాలకు పాకింది. సింగపూర్, పోర్చుగీస్ దేశస్థులు సైతం ఈ ‘కచ్చా బాదం’ పాటకు స్టెప్పులేశారు. దీంతో భువన్ బాగా పాపులరైపోయాడు. ఇటీవల ఓ మ్యూజిక్ సంస్థ అతడితో ఓ ర్యాప్ సాంగ్ రూపొందించింది. అవే లిరిక్స్‌కు ర్యాప్‌ను జోడించి.. భువన్ వస్త్రధారణను మార్చేసి.. అతడి పక్కన ఓ మోడ్రన్ అమ్మాయితో డాన్స్ చేయించారు. యూట్యూబ్‌లో ఈ పాటను విడుదల చేయగా.. కోట్ల మందికి పైగా వీక్షించారు. మరోవైపు భువన్‌కు కొంత ఆర్థిక సాయం అందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే, గుడిసెలాంటి ఇంట్లో బతుకు వెళ్లదీస్తున్న తనని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.
మరిన్ని చూడండి ఇక్కడ: