AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కర్మ సిద్ధాంతం అంటే ఇదే.. కుక్కను తన్నబోయాడు, నవ్వుల పాలయ్యాడు..

Viral Video: జీవితంలో మనం ఏదో చేస్తే మనకు అదే వస్తుంది అని చెబుతుంటారు. ఇతరులను ప్రేమతో పలకరిస్తే, వారి నుంచి కూడా ప్రేమతో కూడిన సమాధానమే వస్తుంది. ద్వేషంతో మాట్లాడిస్తే ద్వేషంతో కూడిన రిప్లై వస్తుంది. దీనినే కర్మ సిద్ధాంతం అని కూడా అంటారు. ఇతరులకు ఇబ్బందులు గురి చేయాలని...

Viral Video: కర్మ సిద్ధాంతం అంటే ఇదే.. కుక్కను తన్నబోయాడు, నవ్వుల పాలయ్యాడు..
Viral Video
Narender Vaitla
|

Updated on: Feb 21, 2022 | 9:24 AM

Share

Viral Video: జీవితంలో మనం ఏదో చేస్తే మనకు అదే వస్తుంది అని చెబుతుంటారు. ఇతరులను ప్రేమతో పలకరిస్తే, వారి నుంచి కూడా ప్రేమతో కూడిన సమాధానమే వస్తుంది. ద్వేషంతో మాట్లాడిస్తే ద్వేషంతో కూడిన రిప్లై వస్తుంది. దీనినే కర్మ సిద్ధాంతం అని కూడా అంటారు. ఇతరులకు ఇబ్బందులు గురి చేయాలని ప్రయత్నిస్తే అది రివర్స్‌ అయి మననే ఇబ్బంది పెడుతుంది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెబుతోంది. కర్మ సిద్ధాంతానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందీ వీడియో.

వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ అలా వెళుతున్నాడు. ఈ సమయంలోనే అతనికి రోడ్డుపై ఓ శునకం కనిపించింది. దాని మానన అది పోతున్న శునకాన్ని తన్నడానికి ప్రయత్నించాడు. అయితే కుక్క కాస్త కొంచెం ముందుకు జరిగింది. దీంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగానే, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిపై దుమ్మెత్తి పోస్తున్నారు. కర్మ అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అన్యాయంగా ఇతరులను ఇబ్బందికి గురి చేస్తే, మూల్యం చెల్లించక తప్పదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కదూ.! నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Also Read: News Watch LIVE : కేసీఆర్ వెంట ముంబైకు ప్రకాష్ రాజ్ ఎందుకు..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..(వీడియో)

Tech Companies: లాభాల పంట పండించిన షేర్లు.. అసలు నిమిషానికి ఆ కంపెనీలు ఎన్ని కోట్లు ఆర్జిస్తున్నాయో మీరే చూడండి..

Cucumbers: బరువు తగ్గాలంటే తినడం తగ్గించడం కాదు.. వీటిని తినడం పెంచాలి..