AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash Dhull: రంజీల్లో దుమ్మురేపుతున్న యశ్​ధుల్.. ఫామ్​లోకి వచ్చిన రహానె, పుజారా..

భారత అండర్​-19 వరల్డ్​కప్ కెప్టెన్​గా అదరగొట్టి, జట్టును ఛాంపియన్​గా నిలబెట్టిన యశ్​ధుల్​.. రంజీల్లో కూడా దుమ్మురేపుతున్నాడు...

Yash Dhull: రంజీల్లో దుమ్మురేపుతున్న యశ్​ధుల్.. ఫామ్​లోకి వచ్చిన రహానె, పుజారా..
Yash Dhull
Srinivas Chekkilla
|

Updated on: Feb 21, 2022 | 8:15 AM

Share

భారత అండర్​-19 వరల్డ్​కప్ కెప్టెన్​గా అదరగొట్టి, జట్టును ఛాంపియన్​గా నిలబెట్టిన యశ్​ధుల్​.. రంజీల్లో కూడా దుమ్మురేపుతున్నాడు. తొలి మ్యాచ్​లోనే రెండు సెంచరీలు బాదాడు. తొలి ఇన్నింగ్స్​లో శతకం నమోదు చేసిన ధూల్​.. రెండో ఇన్నింగ్స్​లో కూడా మరో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీల్లో అరంగేట్రం మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో రెండు శతకాలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత నారీ కాంట్రాక్టర్, విరాగ్​ అవతేల పేరిట ఉంది.

దిల్లీకి ఆడుతున్న ధుల్​.. తమిళనాడుతో మ్యాచ్​లోని రెండో ఇన్నింగ్స్​లో 200 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 13 బౌండరీలు ఉన్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో 113 పరుగులు చేశాడు. టీమ్​ఇండియా టెస్టు జట్టులో స్థానం కోల్పోయి బీసీసీఐ వేటుకు గురైన రహానె-పుజారా ద్వయం మళ్లీ రంజీ మ్యాచ్​లతో ఫామ్​ అందుకుంది.

సౌరాష్ట్రతో మ్యాచ్​లో సెంచరీ బాదిన రహానె ఫామ్​లోకి వచ్చాడు. మరోవైపు పుజారా.. తొలిఇన్నింగ్స్​లో డకౌట్​ అయినా రెండో ఇన్నింగ్స్​ నిలకడగా ఆడి 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, ఓ సిక్సర్​ ఉన్నాయి. ఈసారి రంజీ ట్రోఫీని రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ టోర్నీ తొలి దశ మార్చి 15 వరకు కొనసాగుతుంది. ఐపీఎల్​ పూర్తయ్యాక మే 30 నుంచి జూన్​ 26 వరకు రెండో దశ టోర్నీ జరుగుతుంది.

Read Also.. IND vs SL: రంజీలో పరుగులు, వికెట్లు తీస్తేనే జట్టులోకి రీఎంట్రీ.. నలుగురు సీనియర్‌ ప్లేయర్లకు సెలక్టర్ల సందేశం..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?