AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cucumbers: బరువు తగ్గాలంటే తినడం తగ్గించడం కాదు.. వీటిని తినడం పెంచాలి..

చాలా మంది బరువు తగ్గాలంటే తినడం తగ్గించుకోవాలనుకుంటారు. కానీ కొన్నింటి తింటే బరువు తగ్గుతారని తెలుసా..

Cucumbers: బరువు తగ్గాలంటే తినడం తగ్గించడం కాదు.. వీటిని తినడం పెంచాలి..
Srinivas Chekkilla
|

Updated on: Feb 21, 2022 | 7:00 AM

Share

చాలా మంది బరువు తగ్గాలంటే తినడం తగ్గించుకోవాలనుకుంటారు. కానీ కొన్నింటి తింటే బరువు తగ్గుతారని తెలుసా.. కీరదోసకాయ ఆరోగ్యానికి చక్కని ఔషధం. వేసవి దాహం..తాపం తీర్చే మంచినీటి సరస్సు కీర దోసకాయ. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీన్ని తింటున్నారు. కీరదోసకాయలో (Cucumber) కొవ్వు నిల్. తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి (lose weight) ఇది అద్భుతమైన చిరుతిండి అని అనవచ్చు.

కీరదోస బరువు తగ్గడానికి ఇది బాగా దోహదం చేస్తుంది. కొందరు కీరదోసకు నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు జోడించి తింటుంటారు రుచి కోసం. రోజుకు ఒక్క కీరదోసకాయ తినడం మంచిది. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. కాబట్టి, మీరు ఒకటి కంటే ఎక్కువ తింటే, అది ఎటువంటి హాని కలిగించదు. జంక్ ఫుడ్ తినకుండా ఇలాంటివి తింటుంటే కొవ్వు పెరగకుండా ఉంటుంది.

కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి. ఇది హానికరమైన టాక్సిన్స్ ను బాడీ నుండి ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోసకాయను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. అలాగే కీరదోసకాయకు క్యారెట్, ఆపిల్స్, మస్క్ మెలోన్ వంటివి జోడించి సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. రోజూ కీరదోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. మేజర్ హెల్త్ సమస్యలను నివారించడంలో కూడా కీరదోస గ్రేట్ గా సహాయపడుతుంది.

Read Also.. High BP: హై బీపీ తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి.. అవేంటంటే..?