Neem Tea: వేపాకు టీ ఎప్పుడైనా తాగారా.. లేకుంటే వెంటనే తాగేయండి.. ఎందుకంటే..
రకరకాల టీ పేర్లు విని ఉంటారు. కానీ వేపాకు టీ పేరు ఎప్పుడు విని ఉండరు. కానీ వేపాకు టీ ఉంటుంది.

రకరకాల టీ పేర్లు విని ఉంటారు. కానీ వేపాకు టీ పేరు ఎప్పుడు విని ఉండరు. కానీ వేపాకు టీ ఉంటుంది. ఇది హెర్బల్ టీ. వేపాకును ఔషధ గనిగా చెబుతారు నిపుణులు. రకరకాల అనారోగ్య సమస్యలను వేపాకు దివ్య ఔషధం. ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతూంటారు. వేపాకు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌పై చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఇదే క్రమంలో వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన పోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉపశమనాన్ని ఇస్తుంది.
వేపాకులో ఉన్న అద్భుతమైన ఔషధ గుణం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. చుండ్రు సమస్యను తొలగిస్తుంది. ఇందుకు కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. దాన్ని చల్లారనివ్వాలి. షాంపుతో తలస్నానం చేసాక.. మరిగించి చల్లార్చిన వేపాకు నీటితో మరోసారి శుభ్రం చేసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
ఇలాంటి ఔషధ గుణాలు నీమ్ టీ సొంతం. అయితే.. నీమ్ టీని గర్భిణిలు తాగొద్దు. డాక్టర్ల సలహా తీసుకోవడం ఉత్తమం. బాలింతలు కూడా వేపాకు టీ తాగకూడదు. వీరితోపాటు.. అవయవ మార్పిడి చేసుకున్నవారు.. కొన్ని రోజుల క్రితమే శస్త్రచికిత్స చేయించుకున్నవారు వేపాకు టీ తాగకుండా ఉండాలి. వేపాకు టీని.. రెండు కప్పుల నీటిలో 6-10 వేపాకులు వేసి మరిగించాలి.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Eyes: కళ్లని చూసి మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు.. ఈ లక్షణాలను తేలికగా తీసుకోకండి..?



