Brinjal Benefits: బరువు తగ్గడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి వారంలో ఒకసారైనా వంకాయను తినే ఆహారంలో చేర్చుకోండి..
Brinjal Benefits: వివిధ సీజన్లలో లభించే పండ్లు, కూరగాయలు. ఆయా సీజన్ కు అనుగుణంగా శరీరానికి ఆరోగ్యాన్ని, పోషకాలను, అదనపు సంరక్షణను అందిస్తాయి. ముఖ్యంగా కూరగాయలు,
Brinjal Benefits: వివిధ సీజన్లలో లభించే పండ్లు, కూరగాయలు. ఆయా సీజన్ కు అనుగుణంగా శరీరానికి ఆరోగ్యాన్ని, పోషకాలను, అదనపు సంరక్షణను అందిస్తాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు బరువు తగ్గడం నుంచి శరీరంలో నీటి స్థాయిని మెయింటెయిన్ చేయడం వరకు అనేక రకాలుగా మేలు చేస్తాయి. అందుకనే మీరు మీ ఆహారంలో చేర్చుకో దగిన పోషకాహారం వంకాయ. ఈ విషయాన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో లోవ్‌నీత్ బాత్రా పంచుకున్నారు. ఆ వీడియోకి రోటీలకు నెయ్యి తో పాటు వంకాయ కూరను జత చేసి తింటే ఆ ఆనందం వర్ణనాతీతం అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వంకాయ ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు.. పర్ఫెక్ట్ కంఫర్ట్ ఫుడ్ అని చెప్పారు. ముఖ్యంగా గాలులతో కూడిన శీతాకాలంలో వంకాయ మంచి ఎంపిక అని చెప్పారు లోవ్‌నీత్ బాత్రా.
వంకాయ ఆరోగ్య ప్రయోజనాలు:
- జీవక్రియ పెరుగులకు: వంకాయలో గ్లైకాల్-ఆల్కలాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. వంకాయలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
- హీలింగ్ పవర్: బర్న్స్, మొటిమలు, ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్లు, పొట్టలో పుండ్లు, స్టోమాటిటిస్ , ఆర్థరైటిస్ వంటి వివిధ రుగ్మతలను నివారించడంలో వంకాయ అద్భుతంగా పనిచేస్తుంది.
- బరువు తగ్గడంలో సహాయపడుతుంది: వంకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వంకాయ తినగానే కడుపు నిండినట్లు కూడా ఉంటుంది.
- మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది: వంకాయలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు కణ త్వచాలను రక్షిస్తాయి.మెదడు యొక్క జ్ఞాపకశక్తి పనితీరును పెంచుతాయి. ఫ్రీ రాడికల్ కణాల నిర్మూలనకు విరుద్ధంగా దాని కణాన్ని రక్షించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. వంకాయలో ఉండే కాంపౌండ్స్ బ్రెయిన్ ట్యూమర్‌ను నివారించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.
- గర్భిణీ స్త్రీలకు: వంకాయను Fe chelator అని కూడా పిలుస్తారు. వంకాయ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు , యుక్తవయస్సులో ఉన్న ఆడవారికి ప్రత్యేకంగా వంకాయ మేలు చేస్తుంది.
- అయితే కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎక్కువ గా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు
Note: (ఈ ఆర్టికల్‌లో మేము సాధారణ పాఠకుని ఆసక్తిని అనుసరించి, సలహాతో కూడిన సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది..)
Also Read: