Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stick Insect: ఓ వ్యక్తి పెంపుడు మిడత.. సగం ఆడ.. సగం మగ.. ఇదెలా సాధ్యం అంటున్న శాస్త్రవేత్తలు

Dual Gender Stick Insect: ప్రకృతి మానవ మేధస్సుకు అందని ఓ మిస్టరీనే..  తనలో దాచుకున్న వింతలను ఒకొక్కటిగా వెల్లడిస్తూ.. సవాల్ విసురుతూనే ఉంది. తాజాగా ఓ మిడత..

Stick Insect: ఓ వ్యక్తి పెంపుడు మిడత.. సగం ఆడ.. సగం మగ.. ఇదెలా సాధ్యం అంటున్న శాస్త్రవేత్తలు
Stick Insect Is Male And Fe
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2022 | 7:19 PM

Dual Gender Stick Insect: ప్రకృతి మానవ మేధస్సుకు అందని ఓ మిస్టరీనే..  తనలో దాచుకున్న వింతలను ఒకొక్కటిగా వెల్లడిస్తూ.. సవాల్ విసురుతూనే ఉంది. తాజాగా ఓ మిడత శాస్త్రవేత్తలకే షాకిచ్చింది. డ్యూయల్‌ జెండర్‌తో శాస్త్రవేత్తలను అవాక్కయ్యేలా చేసింది. దాంతో దీని సంగతేంటో తేల్చుకోవాలని శాస్ర్తవేత్తలు పరిశోధనల్లో మునిగిపోయారు.. అసలు విషయం ఏంటంటే… ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. దీనిని గ్రీన్‌బీన్‌ స్టిక్‌ ఇన్‌సెక్ట్‌ అని పిలుస్తారు. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి దీనిని పెంచుకుంటున్నాడు. అయితే ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. దాంతో ఆ మిడతకు ఏమైందోనని అనుమానం వచ్చిన అతను శాస్త్రవేత్తలకు చూపించాడు.. దానిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. ఎందుకంటే చార్లీ సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు.

సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయట. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు కలిగి ఉందట. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియానికి తరలించి పరిశోధనలు చేస్తున్నారు.

Read Also:

 విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. రాష్ట్రపతి కోవింద్‌కు నౌకాదళం గౌరవ వందనం..

క్యాన్సర్, కిడ్నీలను శుభ్రపరిచే రోవాన్ బెర్రీ.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..