Indian Naval Fleet: విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. రాష్ట్రపతి కోవింద్‌కు నౌకాదళం గౌరవ వందనం..
Indian Naval Fleet 2022: విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐఎన్ఎస్ (INS) సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తున్నారు.
Indian Naval Fleet 2022: విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐఎన్ఎస్ (INS) సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ పైకి ఎగురుతూ రాష్ట్రపతి కోవింద్ (Ram Nath Kovind) కుగౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. 60 యుద్ధనౌకలతోపాటు సబ్ మెరైన్స్, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. దీనిలో భాగంగా భారత నౌకాదళ శక్తి (Naval Fleet Review) సామార్థ్యాలను రాష్ట్రపత్రి రామ్‌నాథ్ సమీక్షిస్తున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో జరుగుతోంది. 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో రాష్ట్రపతి 21-గన్-సెల్యూట్ అందుకున్నారు. అంతకుముందు నేవల్ డాక్‌యార్డ్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
Andhra Pradesh | President Ram Nath Kovind reviews the Indian Naval Fleet comprising over 60 ships and submarines, and 55 aircraft pic.twitter.com/uxUPOOMHb5
— ANI (@ANI) February 21, 2022
ప్రెసిడెంట్ నావల్ ఫ్లీట్ రివ్యూ (Naval Fleet Review) కోసం విశాఖ వచ్చిన రాష్ట్రపతికి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఫ్లీట్ రివ్యూలో భాగంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి విశాఖకు చేరుకున్నారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా, ప్రతి భారత రాష్ట్రపతి తన ఐదేళ్ల కాలంలో భారత నావికాదళాన్ని ఒకసారి సమీక్షిస్తారు.
#WATCH | President Ram Nath Kovind reviews the Indian Naval Fleet comprising over 60 ships and submarines, and 55 aircraft
The 12th edition of President’s Fleet Review is being conducted at Visakhapatnam as part of Azadi Ka Amrit Mahotsav pic.twitter.com/MUWsnA6jkd
— ANI (@ANI) February 21, 2022
కాగా.. 25 నుంచి మిలన్ 2022పేరుతో విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో వివిధ దేశాల నావికాదళ విన్యాసాలు ఆకట్టుకుంటాయి. మార్చి 4 వరకూ జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి.
#WATCH | President Ram Nath Kovind embarks on the Presidential Yacht INS Sumitra and receives 21-gun-salute during the 12th edition of President’s Fleet Review at #EasternNavalCommand, Visakhapatnam
Defence Minister Rajnath Singh is also present at the event pic.twitter.com/SutgAHSohv
— ANI (@ANI) February 21, 2022
Also Read: