Shakuntala Choudhary: స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజికవేత్త శకుంతలా చౌదరి కన్నుమూత.. ప్రధాని మోడీ సంతాపం

Shakuntala Choudhary Passes Away: గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి (102) సోమవారం కన్నుమూశారు.

Shakuntala Choudhary: స్వాతంత్ర్య సమరయోధురాలు, సామాజికవేత్త శకుంతలా చౌదరి కన్నుమూత.. ప్రధాని మోడీ సంతాపం
Shakuntala Choudhary
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 21, 2022 | 11:04 AM

Freedom fighter Shakuntala Choudhary:  గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి (102) సోమవారం కన్నుమూశారు. అస్సాం(Assam)లోని కామ్రూప్‌కు చెందిన ఆమె గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు, పిల్లల కోసం పనిచేశారు. దేశవ్యాప్తంగా ఆమె ‘శకుంతల బైడియో’గా ప్రసిద్ధి చెందారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆమెను భారత ప్రభుత్వం(India Government)పద్మశ్రీ(Padmashree) అవార్డుతో ఘనంగా సత్కరించింది.

శకుంతలా చౌదరి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. గాంధేయ విలువలను పెంపొందించేందుకు శకుంతలా చౌదరి జీవితాంతం చేసిన కృషికి గుర్తుండిపోతారని ఆయన అన్నారు. “సరనియా ఆశ్రమంలో ఆమె చేసిన గొప్ప పని చాలా మంది జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసింది. ఆమె మరణించడం బాధాకరం. నా ఆలోచనలు ఆమె కుటుంబం మరియు అసంఖ్యాక ఆరాధకులతో ఉన్నాయి,” అన్నారాయన.సరనియా ఆశ్రమం అస్సాంలోని గౌహతిలో ఉంది.

కాగా, ఆమె వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గౌహతిలోని కస్తూర్బా ఆశ్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూశారు. అస్సాంకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త శకుంతలా చౌదరి గౌహతిలోని కస్తూర్బా ఆశ్రమంలో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ఆమె పనిచేశారు. ఆమె భారత ప్రభుత్వం నుండి వయోశేష్ఠ సమ్మాన్ – సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ అవార్డులు 2021 సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. “పెద్ద గాంధేయవాది పద్మశ్రీ శకుంతలా చౌదరి మరణించినందుకు తీవ్ర వేదన” అని రాశారు. “1946లో మహాత్మా గాంధీ బస చేసిన గౌహతిలోని సరానియా ఆశ్రమంలో ఆమె జీవితం నిస్వార్థ సేవ, సత్యం, సరళత మరియు అహింసకు అంకితం చేయబడింది. ఆమె సద్గతి ఓం శాంతికి నా ప్రార్థనలు!,” అన్నారాయన. Read Also… AP Minister Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణానికి కారణం అదేనా..?

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..