AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్‌ అవుతోన్న పాత వీడియో..

Samantha: 'ఏం మాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ అందాల తార సమంత. ఆ తర్వాత తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న సామ్‌.. నాగ చైతన్యతో వివాహం తర్వాత అక్కినేని కోడలిగా మారింది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు..

Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్‌ అవుతోన్న పాత వీడియో..
Samantha Viral Video
Narender Vaitla
|

Updated on: Feb 21, 2022 | 12:57 PM

Share

Samantha: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ అందాల తార సమంత. ఆ తర్వాత తెలుగులో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న సామ్‌.. నాగ చైతన్యతో వివాహం తర్వాత అక్కినేని కోడలిగా మారింది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు, తమ అభిమానులను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్ని రోజుల పాటు ఈ వార్త నిజం కాకూడదని వీరి అభిమానులు కోరుకున్నారు. ఇక మరికొన్ని దుష్ప్రచారాలు కూడా జరిగాయి. అయితే ఈ జంట మాత్రం తమ విడాకులకు గల కారణమేంటో ఎక్కడా బయట పెట్టలేదు. ఇక ఈ జంట విడిపోయి ఇప్పటికే దాదాపు 5 నెలలు గడుస్తోన్న వీరిద్దరికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.

గతంలో సమంత చైతన్య గురించి మాట్లాడిన వీడియోలను వెతికి మరీ ఫ్యాన్స్‌ మరోసారి వైరల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. గతంలో ఓసారి నిర్వహించిన ‘ఆస్క్‌ మి ఎనిథింగ్‌’ సెషన్‌లో సమంత ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ సందర్భంగా ‘మీకు ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడానికి కారణం ఏంటి.?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

ఈ విషయమై సమంత మాట్లాడుతూ.. ‘మీకు ఇప్పుడు ఒక పెద్ద సీక్రెట్‌ చెప్పబోతున్నాను. నేను జిమ్‌కు వెళ్లడానికి అసలు కారణం ఏంటో తెలుసా.? చైని (నాగచైతన్య)ను చూడడానికే జిమ్‌కు వెళ్లేదానిని’ అని చెప్పుకొచ్చింది. అంటే నాగచైతన్యను చూడడానికే సమంత జిమ్‌కు వెళ్లేదన్నమాట. దీంతో ప్రస్తుతం ఈ వీడియో మరోసారి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంత అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఎందుకిలా విడిపోయిందంటూ.. ఫ్యాన్స్‌ వాపోతున్నారు.

View this post on Instagram

A post shared by Sam (@madfanofsam)

Also Read: Andhra Pradesh: ఏపీలో వాహనదారులకు అలర్ట్.. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే బాదుడే..బాదుడు

Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్‌ రిలీజ్‌..

Crime News: రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. తాళి కట్టే క్షణంలో షాకిచ్చిన భార్య.. అసలు సంగతి తెలిసి..